- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Dell: మార్చి 3 నుంచి ఐదు రోజులు ఆఫీసులకు రావాల్సిందే: డెల్
వారంలో ఐదు రోజు ఆఫీసు నుంచే పని చేయాలని, ఈ నిబంధన మార్చి 3వ తేదీ అమలవుతుందని కంపెనీ తెలిపింది.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ కంప్యూటర్ల తయారీ కంపెనీ డెల్ కీలక నిర్ణయం తీసుకుంది. టెక్ రంగంలో దాదాపు చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని వదులుకుంటున్న నేపథ్యంలో డెల్ కూడా హైబ్రిడ్, రిమోట్ వర్క్ విధానాన్ని తొలగిస్తూ ఉద్యోగులకు సమాచారం అందించింది. ఆఫీసులకు దగ్గరలో నివశించే ఉద్యోగులకు సంబంధించి కంపెనీ హైబ్రిడ్, రిమోట్ వర్క్ పాలసీని ముగించినట్లు డెల్ సీఈఓ మైఖేల్ డెల్ ఉద్యోగులకు ఇమెయిల్ పంపారు. వారంలో ఐదు రోజు ఆఫీసు నుంచే పని చేయాలని, ఈ నిబంధన మార్చి 3వ తేదీ అమలవుతుందని కంపెనీ తెలిపింది. అయితే, ప్రస్తుతానికి ఈ నిబంధన ఆఫీసులకు దగ్గరలో ఉన్నవారికి మాత్రమేనని చెప్పారు. దూరంగా నివశించే ఉద్యోగులు మాత్రం ముగ్గురు సీనియర్ లీడర్ల నుంచి సరైన కారణాల సమర్పించి రిమోట్‌గా పనిచేయవచ్చని వెల్లడించారు. లేకుంటే ప్రమోషన్ అవకాశాలను కోల్పోతారని సీఈఓ స్పష్టం చేశారు. అంతేకాకుండా భవిష్యత్తులో జరిగే నియామకాల్లోనూ రిమోట్ వర్క్ విధానం ఉండదని కంపెనీ స్పష్టం చేసింది. ఉద్యోగులు ఆఫీసుల్లో అందరూ కలిసి పనిచేయడం, ఆలోచనలు పంచుకోవడం ద్వారా కంపెనీ వృద్ధికి అవకాశం ఉంటుందని కంపెనీ భావిస్తోంది. అందుకే ఉద్యోగులందరూ ఆఫీసులకు రావాలనే నిర్ణయం తీసుకుంది.






