deepseek : అరుణాచల్ ప్రదేశ్ పై deepseek సమాధానం.. కంగు తింటున్న నెటిజన్స్

by Muthe.Rajitha |   (  Updated:2025-01-28 10:23:54  IST  )

తాజాగా ఆర్టిఫీసియల్ ఇంటెలిజెన్స్(AI) లో సంచలనం సృష్టిస్తున్న చైనా(China) ఏఐ "deepseek" పై నెట్టింట్లో దుమారం రేగుతోంది.

deepseek : అరుణాచల్ ప్రదేశ్ పై deepseek సమాధానం.. కంగు తింటున్న నెటిజన్స్
X

దిశ, వెబ్ డెస్క్ : తాజాగా ఆర్టిఫీసియల్ ఇంటెలిజెన్స్(AI) లో సంచలనం సృష్టిస్తున్న చైనా(China) ఏఐ "deepseek" పై నెట్టింట్లో దుమారం రేగుతోంది. గూగుల్(Google), మైక్రోసాఫ్ట్(Mycrosoft), ఓపెన్ ఏఐ(Open AI) వంటి టెక్ దిగ్గజాలను తలదన్నేలా.. తక్కువ ఖర్చుతోనే హాంగ్జౌకు చెందిన ఏఐ రీసెర్చ్ సంస్థ 'డీప్ సీక్' ఏఐ మోడల్ ను అందుబాటులోకి తెచ్చింది. ఓ వైపు చాట్ జీపీటీ, జెమిని, క్లౌడ్ వంటి వాటికంటే మెరుగైన పనితీరు కనబరుస్తుందని ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ మోడల్ ను యూజర్లకు ఉచితంగా అందిస్తుండగా.. మిగతావి కొంత మొత్తాన్ని సబ్ స్క్రిప్షన్ రూపంలో వసూలు చేస్తున్నాయి. ఏఐ రంగంలో దీని పేరు మారు మ్రోగగా.. మరోవైపు deepseek ఇచ్చిన ఓ సమాధానంపై భారత్ లో వివాదం రేగుతోంది.

భారత్ లోని రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్(Arunachal Pradesh) గురించి అడిగిన ప్రశ్నకు.. అదిచ్చిన సమాధానం తాలూకు స్క్రీన్ షాట్స్ నెట్టింట్లో వైరల్ అయ్యాయి. ఇందులో రిజిస్టర్ చేసుకున్న ఓ యూజర్ అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో ఓ రాష్ట్రం అని టైప్ చేయగా.. అందుకు స్పందించిన చాట్ బాట్.. "ఇది నా పరిధి దాటిన అంశం. వేరే ఏదైనా చర్చిద్దాం" అని సమాధానం ఇవ్వడంతో విస్తు పోవడం యూజర్ వంతైంది. ఆ తరువాత అదే యూజర్ ఈశాన్య రాష్ట్రాల పేర్లు అడగ్గా.. చాట్ బాట్ మళ్ళీ అదే సమాధానం ఇచ్చింది. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్లు నెట్లో హాల్ చల్ చేస్తున్నాయి. కాగా దీనిపై స్పందిస్తున్న నెటిజన్స్ షాక్ అవడమే కాదు.. చైనా బుద్ది చూపించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఈ యాప్ ను బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.




Next Story