- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Eternal Group: ఎటర్నల్ గ్రూప్ సీఈఓ పదవి నుంచి వైదొలగిన దీపిందర్ గోయల్
కంపెనీకి కొత్త సీఈఓగా ప్రస్తుతం బ్లింక్ఇట్ బాధ్యతలు చూస్తున్న అల్బీందర్ దిండ్సా రానున్నారు.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో మాతృసంస్థ ఎటర్నల్ గ్రూప్ వ్యవస్థాపకుడు, సీఈఓ పదవి నుంచి దీపిందర్ గోయల్ వైదొలగుతున్నట్టు ప్రకటించారు. ఈ నిర్ణయం ఫిబ్రవర్ 1 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపారు. కంపెనీకి కొత్త సీఈఓగా ప్రస్తుతం బ్లింక్ఇట్ బాధ్యతలు చూస్తున్న అల్బీందర్ దిండ్సా రానున్నారు. ఈ మేరకు ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో కంపెనీ వివరాలను వెల్లడించింది. ఈ విషయంపై షేర్‌హోల్డర్లకు రాసిన లేఖలో దీపిందర్ గోయల్.. ఇటీవల తనకు హై రిస్క్ ఉన్న కొత్త ఆలోచనలు వచ్చాయి. అయితే, వీటిని ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు ఎటర్నల్ లాంటి పబ్లిక్ లిస్టెడ్ కంపెనీకి బయట ఉండి చేయాల్సి ఉంటుంది. ఈ కారణంగానే సీఈఓ పదవికి రాజీనామా చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఇక నుంచి ఎటర్నల్ గ్రూప్ బాధ్యతలను అల్బిందర్ దిండ్సా నిర్వహిస్తారు. కంపెనీ కార్యకలాపాలు, నిర్వహణ, వ్యాపార నిర్ణయాలను ఆయనే తీసుకుంటారని దీపిందర్ గోయల్ తన లేఖలో వివరించారు. ప్రస్తుతం బ్లింక్ఇట్ నిర్వహణలో ఆయన సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, ఎటర్నల్‌ను విజయవంతంగా నడిపిస్తారనే నమ్మకం తనకుందని అభిప్రాయపడ్డారు. ఇక, తాను కంపెనీ బోర్డు డైరెక్టర్, వైస్-ఛైర్మన్‌గా కొనసాగుతానని వెల్లడించారు.






