- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రైవేట్ జెట్ కొనుగోలుపై జోమాటో సీఈఓ దీపిందర్ గోయల్ క్లారిటీ
ఫుడ్ డెలివరీ రంగంలో తనదైన ముద్ర వేసిన జొమాటో (Zomato) మాతృ సంస్థ ఎటర్నల్ వ్యవస్థాపకుడు, సీఈఓ డీపిందర్ గోయల్ (Deepinder Goyal) తాజాగా పౌర విమానయాన రంగంలోకి అడుగుపెడుతున్నట్టు వార్తలు వైరల్ అయ్యాయి.

దిశ, వెబ్ డెస్క్: ఫుడ్ డెలివరీ రంగంలో తనదైన ముద్ర వేసిన జొమాటో (Zomato) మాతృ సంస్థ ఎటర్నల్ వ్యవస్థాపకుడు, సీఈఓ డీపిందర్ గోయల్ (Deepinder Goyal) తాజాగా పౌర విమానయాన రంగంలోకి అడుగుపెడుతున్నట్టు వార్తలు వైరల్ అయ్యాయి. బాంబర్డియర్ గ్లోబల్ సిరీస్‌కు చెందిన లగ్జరీ ప్రైవేట్ జెట్‌ను ఆయన కొనుగోలు చేశారని, జులై 16 నుంచి అది ఢిల్లీలోని వీఐపీ బే వద్ద నుంచి కార్యకలాపాలు ప్రారంభించనుందని ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. ఇప్పటికే గోయల్ 'LAT Aerospace' అనే ఏవియేషన్ స్టార్టప్‌ను ప్రారంభించగా, అదే ఈ వార్తలకు బలం చేకూర్చింది.
అయితే, ప్రైవేట్ జెట్ కొనుగోలు వార్తలపై దీపిందర్ గోయల్ స్వయంగా ఎక్స్ వేదికగా క్లారిటీ ఇచ్చారు. 'LAT ఒక స్టార్టప్ మాత్రమే. ఎలాంటి ప్రైవేట్ జెట్‌ను కొనుగోలు చేయలేదు. మేము ప్రాంతీయ విమానయాన అవసరాల కోసం విమానాలను రూపొందించడంపై దృష్టి పెట్టాము. అలాగే, నేను వ్యక్తిగతంగా కూడా ఎలాంటి ప్రైవేట్ జెట్‌ను కలిగి లేను' అని గోయల్ ట్వీట్ చేశారు. ఈ వివరణతో, ప్రస్తుతానికి ప్రచారంలో ఉన్న ఊహాగానాలకు ముగింపు పడినట్లైంది.
కాగా, డీపిందర్ గోయల్ జొమాటోలో ప్రస్తుతం 3.83% వాటా కలిగి ఉన్నారు. వాటి విలువ సుమారు రూ.9,847 కోట్లు. ఇక ఫోర్బ్స్ నివేదిక ప్రకారం, ఆయన మొత్తం నికర సంపద 1.6 బిలియన్ల డాలర్లకు పైగా ఉండొచ్చని అంచనా.
For those who want facts more than clickbaity headlines – LAT is a startup, and has not bought any private jet. LAT is about making planes for regional aviation, and is not in the business of buying planes.And, I don't own one personally either. Will be nice to have one though… https://t.co/LDwLjatrg8— Deepinder Goyal (@deepigoyal) July 16, 2025






