- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Nitin Gadkari: దిగుమతులను తగ్గించి, ఎగుమతులను పెంచాలి: నితిన్ గడ్కరీ
ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న ప్రతి దేశం జ్ఞానం, పరిశోధన కారణంగానే ఎదుగుతున్నాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: ఎగుమతులను పెంచి, దిగుమతులను తగ్గించుకోవడం జాతీయవాదానికి అత్యంత ముఖ్యమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. మంగళవారం ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. జ్ఞానం, పరిశోధనలో ముందుకు సాగే ఏ దేశమైనా 'విశ్వగురు'గా నిలుస్తుంది. విద్య, ఆవిష్కరణలను దేశ అభివృద్ధితో అనుసంధానించాల్సిన అవసరం ఉందన్నారు. భారత్‌ను విశ్వగురువుగా మార్చడానికి అతి ముఖ్యమైనది విజ్ఞానం. ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న ప్రతి దేశం జ్ఞానం, పరిశోధన కారణంగానే ఎదుగుతున్నాయి. రక్షణ, వ్యవసాయం, సమాచార సాంకేతిక రంగాలలో అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. గతంలో సైనికులు, ట్యాంకులతో యుద్ధాలు జరిగేవని, ఇప్పుడు డ్రోన్లు, క్షిపణులను ఉపయోగిస్తున్నారని చెప్పారు. ఇది ప్రపంచ డైనమిక్స్‌లో జ్ఞానం ఆధారిత వ్యూహాల వైపు మార్పును సూచిస్తుందని అన్నారు. మనం ఇప్పటికే ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థగా మారాం. ప్రపంచంలో మూడవ అతిపెద్దదిగా మార్చాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లక్ష్యాన్ని సాధించాలంటే విజ్ఞానం, పరిశోధనలపై దృష్టి సారించాలి. వాటిని అభివృద్ధి చేస్తూనే, అందరి జీవితాలకు అన్వయించేలా విద్యనందించాలి. యువత భవిష్యత్తు దేశ భవిష్యత్తుతో ముడిపడి ఉంది. మనం దిగుమతి చేసుకునే వస్తువులు... వాటిపై పరిశోధనలు నిర్వహించడం, దిగుమతులను తగ్గించడం, ఎగుమతులను పెంచాలని గడ్కరీ పేర్కొన్నారు.






