Living Cost: ప్రధాన నగరాల్లో తక్కువ లివింగ్ కాస్ట్ హైదరాబాద్‌లోనే

by S Gopi |

హైదరాబాద్‌తో పాటు మరో రెండు నగరాలు మెరుగైన లివింగ్ కాస్ట్‌తో జీవించే సౌకర్యాలను కలిగి ఉన్నాయని నివేదిక అభిప్రాయపడింది.

Living Cost: ప్రధాన నగరాల్లో తక్కువ లివింగ్ కాస్ట్ హైదరాబాద్‌లోనే
X

దిశ, బిజినెస్ బ్యూరో: మన దేశంలోని ప్రధాన నగరాల్లో జీవించేందుకు ఎంత మొత్తం ఖర్చవుతుందనే అంశం మరోసారి చర్చకు వచ్చింది. ఎంత సంపాదిస్తే మన దేశంలోని ప్రముఖ నగరాల్లో ఒక మధ్య తరగతి కుటుంబం ఎలాంటి బాదరబందీ లేకుండా జీవిస్తుందనే ఆసక్తికర విషయాలను తాజాగా ఓ నివేదిక వెల్లడించింది. ఇందులో దేశంలోని అనేక పెద్ద నగరాల కంటే హైదరాబాద్‌తో పాటు మరో రెండు నగరాలు మెరుగైన లివింగ్ కాస్ట్‌తో జీవించే సౌకర్యాలను కలిగి ఉన్నాయని నివేదిక అభిప్రాయపడింది. నమ్‌బియో సంస్థ 2026 ఏడాదికి సంబంధించి రూపొందించిన ఈ నివేదిక ప్రకారం, మనదేశంలో జీవన వ్యయం, నివసించే ప్రదేశంపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ముంబై, ఢిల్లీ వంటి పెద్ద మెట్రో నగరాలు, ప్రధానంగా అద్దె, రవాణా ఖర్చుల కారణంగా అధిక వ్యయంతో కూడుకున్నవి. అదే హైదరాబాద్, కోల్‌కతా, చెన్నై వంటి నగరాలు ఆర్థికంగా కాస్త అందుబాటు ధరల్లో ఉన్నాయని నమ్‌బియో పేర్కొంది. ఈ ఏడాది మార్చి నాటికి అప్‌డేట్ చేసిన నమ్‌బియో డేటాను బట్టి, దేశంలో ఒక వ్యక్తికి అద్దె మినహాయించి నెలకు సుమారు రూ. 27,300 అవసరమవుతాయి. నలుగురు సభ్యులున్న ఒక కుటుంబానికి ఈ మొత్తం సుమారు రూ. 98,000 వరకు పెరుగుతుంది. ఈ అంచనాలలో ఆహారం, గృహ వినియోగ ఖర్చులు (యుటిలిటీస్), రవాణా, వినోద ఖర్చులు కలిసి ఉంటాయి. అయితే, మెట్రో నగరాల్లో ఉండే భారీ అద్దె ఖర్చులు ఇందులో చేర్చలేదు. ఇది కూడా చేరిస్తే బడ్జెట్‌ను అమాంతం పెరుగుతుంది.

నగరం వారీగా జీవన వ్యయం

అధిక అద్దె ఖర్చుల కారణంగా, అత్యంత ఖరీదైన నగరంగా ముంబై ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. మరోవైపు, ప్రధాన మెట్రో నగరాల్లోకెల్లా అత్యంత అందుబాటు ధరల్లో జీవనం సాగించడానికి వీలైన నగరాల్లో కోల్‌కతా ఒకటిగా కొనసాగుతోంది.

దేశంలో సగటు నెలవారీ ఖర్చులు

మనదేశంలో జీవన వ్యయాన్ని మరింత అర్థం చేసుకోవడానికి, సగటు రోజువారీ ఖర్చులను కూడా నివేదిక పేర్కొంది.

నగరాల్లో 1బీహెచ్‌కే అద్దె రూ. 14,000 ఉంటే, నగర శివార్లలో ఇది రూ. 9,000గా ఉంది. కిరాణా సామాగ్రికి అయ్యే ఖర్చు పాలు (1లీ) రూ. 61, బ్రెడ్ (500గ్రా) రూ. 39, బియ్యం (1కేజీ) రూ. 56 కాగా, బయట భోజనం చేయాలంటే ఒకరికి బడ్జెట్‌లో కావాలంటే రూ. 200, ఇద్దరికి మిడ్-రేంజ్ భోజనం రూ. 1,050 అవుతుంది. రవాణాకు నెలవారీ పాస్ రూ. 800, వాహనం ఉంటే పెట్రోల్ (1లీ) రూ. 102 అవుతుంది. యుటిలిటీ ఖర్చులకు సంబంధించి 85 చ.మీ., అపార్ట్‌మెంట్‌కు నెలవారీ ఖర్చు రూ. 3,565 అవసరం ఉంటుంది. అయితే, ఈ సంఖ్యలు ప్రాథమిక అంచనా మాత్రమేనని, వ్యక్తుల జీవనశైలి, నగరాన్ని బట్టి వాస్తవంలో ఖర్చులు వేర్వేరుగా ఉంటాయని నివేదిక స్పష్టం చేసింది.

ప్రపంచ టాప్ 10లలో ఢిల్లీ మెట్రో అత్యంత చౌక

ముంబై, ఢిల్లీ వంటి నగరాల్లో ఖర్చులు ఎక్కువగా ఉన్నప్పటికీ, అధిక కొనుగోలు శక్తి కారణంగా హైదరాబాద్, పూణే వంటి నగరాలు మెరుగైన విలువను ఇస్తున్నాయి. గ్లోబల్ ర్యాంకింగ్స్‌లో హైదరాబాద్ (154), పూణే (152) స్థానాల్లో ఉన్నాయి, దీనర్థం ఈ నగరాల్లో వచ్చే జీతాలు ఎక్కువ కాలం సరిపోతాయి.

Next Story