Consumer Durables: రూపాయి పతనంతో ఫ్రిడ్జ్‌లు, ఏసీల ధరలను పెంచే యోచనలో కంపెనీలు

by S Gopi |

దీనివల్ల పూర్తిగా తయారీలో ఖర్చులు ఎక్కువగా మారుతున్నాయని కంపెనీ చెబుతున్నాయి.

Consumer Durables: రూపాయి పతనంతో ఫ్రిడ్జ్‌లు, ఏసీల ధరలను పెంచే యోచనలో కంపెనీలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: గత కొన్ని ట్రేడింగ్ సెషన్లలో భారత కరెన్సీ రూపాయి విలువ రికార్డు స్థాయికి పతనమైంది. దీంతో అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి రూ.90 దాటింది. ఈ క్రమంలో క్షీణిస్తున్న రూపాయి విలువ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ఎయిర్ కండిషనర్ల నుంచి టెలివిజన్ ప్యానెల్‌ల వరకు ఉత్పత్తుల ధరలను 10 శాతం వరకు పెంచాలని కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ సంస్థలు భావిస్తున్నాయి. రూపాయి విలువ తగ్గడంతో పాటు, కంపెనీలు మెమరీ చిప్‌లకు సంబంధించి ముడిసరుకు ఖర్చులు, పెరుగుతున్న రాగి, ప్లాస్టిక్, ఇతర ముడిసరుకుల ఖర్చులను కూడా పరిశీలిస్తున్నాయి. దీనివల్ల పూర్తిగా తయారీలో ఖర్చులు ఎక్కువగా మారుతున్నాయని కంపెనీ చెబుతున్నాయి. ఫలితంగా స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, ఎయిర్ కండిషనర్లు, ఇతర పెద్ద గృహోపకరణాల కంపెనీలు తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉన్నాయి. వివిధ బ్రాండ్‌ల కింద టీవీలను సరఫరా చేసే తయారీ కంపెనీ ఇప్పటికే 7–10 శాతం మేర ధరలను పెంచుతున్నట్టు ప్రకటించగా, ప్రముఖ గృహోపకరణాల తయారీ కంపెనీ తన రిఫ్రిజిరేటర్లు, ఏసీల ధరలను 5–7 శాతం పెంచాలని చూస్తోంది. ఈ పెంపు ప్రభావాన్ని ప్రజలు రాబోయే వారాల్లో లేదా 2026 ప్రారంభంలో చూడవచ్చని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి.

Next Story