- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
LIC Policy: లోన్స్ తీరడం లేదా? రూ.5000 కట్టండి చాలు.. ఈ కొత్త స్కీమ్ గురించి తెలుసా?
LIC Policy: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నో రకాల ఇన్సూరెన్స్ పాలసీలను అందించడమే కాదు కొత్త కొత్త స్కీములను కూడా ప్రవేశపెడుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: LIC Policy: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నో రకాల ఇన్సూరెన్స్ పాలసీలను అందించడమే కాదు కొత్త కొత్త స్కీములను కూడా ప్రవేశపెడుతోంది. దేశంలోని ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీలలో ఎల్ఐసీ అగ్రస్థానంలో ఉంది. ఎల్ఐసీ విశ్వసనీయత, నమ్మకంపై ప్రజలకు పూర్తి నమ్మకం ఉంది. ఇప్పుడు ఎల్ఐసీ వారి తాజా యువ క్రెడిట్ లైఫ్ పాలసీని అందుబాటులో తీసుకువచ్చింది. ఇది రుణాల భారం తక్కువ చేసేలా తయారయ్యింది.ఎల్ఐసీ యువ క్రెడిట్ లైఫ్ పాలసీని 18ఏళ్ల నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వ్యక్తులు తీసుకోవచ్చు. ఈ పాలసీకి కనీస మెచ్యూరిటీ వ్యవధి 23ఏళ్లుగా ఉండగా గరిష్టంగా 75ఏళ్ల వరకు పొడిగించుకోవచ్చు.
ఈ పాలసీ ద్వారా పాలసీ హోల్డర్ మరణిస్తే..అతని కుటుంబానికి రూ. 50లక్షల వరకు కవరేజీ అందుతుంది. ఈ కవరేజీకి హోమ్ లోన్, గోల్డ్ లోన్, పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డ్ లోన్ వంటి లోన్స్ చెల్లించేందుకు ఉపయోగించవచ్చు. అంటే ఈ పాలసీ ద్వారా పర్సనల్ లోన్స్ భారం తగ్గించుకోవచ్చు. ఎల్ఐసీ యువ క్రెడిట్ లైఫ్ పాలసీలో ప్రీమియం చెల్లించేందుకు నాలుగు విధాలుగా ఆప్షన్స్ ఉన్నాయి. 5 నుంచి 30 ఏళ్ల కాల పద్ధతిలో ఒకసారి సింగిల్ ప్రీమియం చెల్లించవచ్చు. 10 నుంచి 30ఏళ్ల పాలసీ టర్మ్ ఉంటే 5ఏళ్ల పాటు ప్రీమియం చెల్లించాలి. 15 నుంచి 30ఏళ్ల టర్మ్ లో 10ఏళ్ల పాటు ప్రీమియం చెల్లించాలి. 25 నుంచి 30ఏళ్ల టర్మ్ లో 15ఏళ్ల పాటు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్రీమియంను ఒకసారి ఏడాదికి లేదా 6నెలలకు ఒకసారి చెల్లించవచ్చు.
ఇది టర్మ్ పాలసీ కావడం వల్ల పాలసీ హోల్డర్ దురదృష్టవశాత్తు మరణిస్తే అతని భార్య లేదా భర్త లేదా కుటుంబ సభ్యులు ఆ సమయంలో ఉన్న లోన్స్ ను చెల్లించాల్సిన బాధ్యతను తీసుకుంటారు. ఎల్ఐసీ ఈ పాలసీ కింద ఇచ్చే కవరేజీతో ఆ మొత్తం లోన్స్ ను చెల్లిస్తారు. అయితే పాలసీ గడువు ముగిసిన తర్వాత ఎలాంటి క్యాష్ బ్యాక్ లేదా ఇతర ప్రయోజనాలు ఉండవు. కానీ ఈ పాలసీని ముందుగా సరెండర్ చేస్తే చెల్లించిన మొత్తం ప్రీమియాన్ని తిరిగి పొందవచ్చు.
ఉదాహరణకు 20ఏళ్ల వ్యక్తి 25ఏళ్ల కాలానికి ఎల్ఐసీ యువ క్రెడిట్ లైఫ్ పాలసీ తీసుకుంటే అతనికి రూ. 50లక్షల కవరేజీ లభిస్తుంది. ఈ పాలసీకి రూ. 4850 ప్రీమియం చెల్లించాలి. ఇది 15ఏళ్లపాటు వర్తిస్తుంది. ఈ ప్రీమియంను ప్రతి ఏడాది లేదా 6 నెలలకోసారి చెల్లించవచ్చు. ఈ పాలసీని ఆన్ లైన్ లో ఎల్ఐసీ వెబ్ సైట్ licindia.in ద్వారా లేదా ఆఫ్ లైన్ లో ఎల్ఐసీ అధికారుల ద్వారా పొందవచ్చు. ఆన్ లైన్ లో డీజీ క్రెడిట్ లైఫ్ పేరుతో ఈ పాలసీ అందుబాటులో ఉంటే ఆఫ్ లైన్ లో యువ క్రెడిట్ లైఫ్ పేరుతో పొందవచ్చు. మొత్తంగా ఎల్ఐసీ యువ క్రెడిట్ లైఫ్ పాలసీ ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది వ్యక్తిగత లోన్స్ తక్కువ చేసే ఒక మంచి పరిష్కారం.






