- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మీరు లక్షాధికారి కావాలా? ఈ SBI కొత్త స్కీమ్ మీకోసమే.. నెలకు ఎంత పెట్టుబడి పెట్టాలంటే?
SBI Har Ghar Lakhpati RD Scheme Calculator: ఈ మధ్య కాలంలో ప్రజల్లో పొదుపుపై అవగాహన భారీగా పెరిగింది.

దిశ, వెబ్‌డెస్క్: SBI Har Ghar Lakhpati RD Scheme Calculator: ఈ మధ్య కాలంలో ప్రజల్లో పొదుపుపై అవగాహన భారీగా పెరిగింది. ఈనేపథ్యంలోనే డిపాజిట్లను పెంచుకునేందుకు బ్యాంకులు కూడా కొత్త కొత్త స్కీమ్స్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. దీనిలో భాగంగానే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొద్ది రోజుల క్రితం రెండు కొత్త పథకాలు ను లాంచ్ చేసింది. దీంట్లో ఒకటి ఎస్బిఐ హర్ ఘర్ లఖ్‌పతి రికరింగ్ డిపాజిట్(SBIS New Har Ghar Lakhpati) స్కీమ్. ఇక్కడ ఎంచుకున్న టెన్యూర్ కోసం నెల నెలా డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బిఐ.. ఇటీవల ఎస్బిఐ పాట్రన్స్, హర్ ఘర్ లఖ్‌పతి రికరింగ్ డిపాజిట్(SBIS New Har Ghar Lakhpati) స్కీమ్ అనే రెండు కొత్త స్కీములను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఫ్యాట్రన్స్ స్కీం 18 ఏళ్లు పైబడిన వారి కోసం అధిక వడ్డీరేటు చెల్లిస్తూ తీసుకొచ్చిన ఫిక్స్ డిపాజిట్ స్కీమ్. హర్ ఘర్ లఖ్‌పతి రికరింగ్ డిపాజిట్ స్కీమ్ ఇది ఒక ప్రీ క్యాలిక్యులేటర్ రికరింగ్ డిపాజిట్. ఇక్కడ రూ. లక్ష లేదా అంతకంటే ఎక్కువ నిధుల్ని సమకూర్చుకునేందుకు ఉద్దేశించిన స్కీం. ఇక్కడ రికరింగ్ డిపాజిట్లకు కనీస కాలవ్యవధి 12 నెలలు కాగా గరిష్టంగా 120 నెలలు ఉంది.
సాధారణంగా ఆర్డీ(RD Scheme)లో మనకు నెలకు 50,000 ఇలా ఎంతైనా పెట్టుబడి చేసుకుంటూ వెళ్తాం. కానీ ఎస్బిఐ కొత్త స్కీమ్ లో మాత్రం మీకు ఎంత అవసరం ఉన్నా దాన్నిబట్టి వడ్డీ రేట్లు ముందే నెల నెలా ఎంత చెల్లించాలో తెలుసుకోవచ్చు. దానిని బట్టి ఆర్డి చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం ఎంత కాలవ్యవధిపై నెలకు ఎంత కట్టాలనేది ముందుగానే లెక్కలు ఉంటాయి. గరిష్టంగా మూడు నుంచి నాలుగేళ్ల వ్యవధి రికరింగ్ డిపాజిట్ లపై అత్యధికంగా సాధారణ ప్రజలకు బ్యాంకు 6.75% వడ్డీ రేటు ఆఫర్ చేస్తోంది.
ఇతర టెన్యూర్ పై మాత్రం 6.5% గా వడ్డీ రేటు ఉంది. అదే సీనియర్ సిటిజన్ల విషయానికి వస్తే అత్యధికంగా మూడు నుంచి నాలుగు ఏళ్ల డిపాజిట్లపై 7.25% వడ్డీ రేటు ఇతర డిపాజిట్ లపై 7 శాతం వడ్డీ రేట్లు ఉన్నాయి. లక్ష రావాలంటే ఇప్పుడు జనరల్ సిటిజెన్, సీనియర్ సిటిజన్ ఏ టెన్యూర్ పై నెలకు ఎంత ఇన్వెస్ట్ చేయాలనేది తెలుసుకుందాం.
సాధారణ ప్రజల విషయం చూస్తే .. మూడేళ్ల కోసం అయితే నెలకు రూ. 2,500 చొప్పున ఇన్వెస్ట్ చేస్తే 6.75% వడ్డీ రేటు లెక్కన మెచ్యూరిటీకి లక్ష రూపాయలు పొందవచ్చు. అదే నాలుగేళ్లకు అయితే ఇదే వడ్డీ రేటుపై నెలకు రూ. 1810 రూపాయల చొప్పున డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఐదేళ్లలో చూస్తే వడ్డీ రేటు 6.5 0% ఉంటుంది. ఇక్కడ ప్రతి నెల రూ.1407 రూపాయల చొప్పున జమ చేయాల్సి ఉంటుంది.
సీనియర్ సిటిజెన్లకు సాధారణ ప్రజలకంటే దాదాపు 50 బేసిస్ పాయింట్లు మేర వడ్డీ రేటు అధికంగా ఉంది. కాబట్టి వీళ్లకు లక్ష రూపాయలు రావాలంటే కాస్త తక్కువ డిపాజిట్ చేయవచ్చు. మూడేళ్ల కాలానికి 7.25% వడ్డీ రేటు లెక్కన నెలకు 2,480 రూపాయలు డిపాజిట్ చేస్తే సరిపోతుంది. ఇదే నాలుగేళ్లలో అయితే ప్రతి నెలరూ. 1791 రూపాయి జమ చేయాల్సి ఉంటుంది. ఐదేళ్లకు 7 శాతం వడ్డీ రేటు లెక్కన నెలకు రూ. 1389 రూపాయల చొప్పున జమ చేసుకుంటూ వెళ్లాలి.
- లఖ్‌పతి ఆర్ డీ పథకాన్ని భారతీయ నివాసితులు ఇండివిడ్యువల్ గా లేదా జాయింట్ గా తీసుకోవచ్చు. పదేళ్లు పైబడిన మైనర్ల పేరుతో గార్డియన్స్ లేదా తల్లిదండ్రులు అకౌంట్ తీసుకోవచ్చు. గడువు ముందే ఐదు లక్షల లోపు విత్ డ్రా చేస్తే 0.5% ఆపై ఉంటే 1 శాతం పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. వరుసగా 6 నెలలు ఇన్ స్టాల్ మెంట్స్ చేయకుంటే ఖాతా క్లోజ్ అవుతుంది.






