3,500 మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్న కాగ్నిజెంట్!

by Disha Web Desk 13 |
3,500 మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్న కాగ్నిజెంట్!
X

చెన్నై: టెక్ రంగంలో లేఆఫ్స్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే దిగ్గజ ఐటీ సేవల కంపెనీలు వేలాది మందిని తొలగించగా, తాజాగా మరో ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ 3,500 మందిని ఇంటికి పంపేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిపింది. ప్రస్తుత ఏడాదిలో కంపెనీ అదాయాం తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయని, పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్ల మధ్య తొలగింపులు తప్పవని కంపెనీ అభిప్రాయపడింది. ప్రధానంగా ఖర్చులను తగ్గించే లక్ష్యంతోనే తాజా తొలగింపుల ప్రక్రియ ఉండనున్నట్టు కంపెనీ సీఈఓ రవి కుమార్ తెలిపారు. అలాగే, ఖర్చుల తగ్గింపులో భాగంగా కంపెనీ 1.1 కోటి చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్‌ను కూడా వదులుకోనున్నట్టు వెల్లడించింది.

ఇక, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి సంబంధించి కాగ్నిజెంట్ లాభాలు 3 శాతం పెరిగాయి. ఇది గత త్రైమాసికం కంటే 11.2 శాతం అధికం. కానీ మార్జిన్ అత్యల్పంగా 14.6 శాతం నమోదవడంతో భవిష్యత్తు ఆదాయం క్షీణిస్తుందని అంచనా వేసింది. దీని పునరుద్ధరణ చర్యలో భాగంగానే 3,500 మందిని తొలగించనున్నట్టు కంపెనీ స్పష్టం చేసింది. మొత్తం తొలగింపుల్లో భారత్‌లో ఎంతమందిని తీసేయనున్నదనే దానిపై కాగ్నిజెంట్ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. కంపెనీ అమెరికా కేంద్రంగా ఉన్నప్పటికీ అత్యధిక కార్యకలాపాలు భారత్‌లోనే నిర్వహిస్తోంది. కంపెనీల్లో మొత్తం 3.51 లక్షల ఉద్యోగులుంటే, దేశీయంగా 2 లక్షల మంది పనిచేస్తున్నారు. ఈ క్రమంలో తాజా లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోనూ ఉండనుందని పరిశ్రమ వర్గాల అంచనా.


Next Story

Most Viewed