Cisco: సిస్కోలో ఉద్యోగాల కోత.. ఏకంగా 4,000 మందిపై వేటు

by Kema Shiva Kumar |

ప్రముఖ నెట్‌వర్కింగ్ దిగ్గజం సిస్కో తన ఉద్యోగులలో 5 శాతం మందిని అంటే సుమారు 4,000 మందిని విధుల నుంచి తొలగిస్తున్నట్లుగా ప్రకటించింది.

Cisco: సిస్కోలో ఉద్యోగాల కోత.. ఏకంగా 4,000 మందిపై వేటు
X

దిశ, వెబ్‌డెస్క్: నెట్‌వర్కింగ్ దిగ్గజం సిస్కో సిస్టమ్స్ (Cisco Systems) సంచలన నిర్ణయం తీసుకున్నది. కంపెనీ ప్రక్షాళనలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా సుమారు 4,000 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి కొత్త టెక్నాలజీలపై దృష్టి సారించే క్రమంలో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లుగా సంస్థ తెలిపింది. అయితే, ఆశ్చర్యకరంగా సిస్కో తన మూడో క్వార్టర్‌లో 15.8 బిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో సుమారు రూ.1.31 లక్షల కోట్ల రికార్డు ఆదాయాన్ని ఆర్జించింది. అయినప్పటికీ, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా సిబ్బందిని తొలగించాలని నిర్ణయించింది. సంస్థను

AI కాలానికి అనుగుణంగా మార్చడానికి సీఈవో చక్ రాబిన్స్ మార్పులు చేర్పులు చేస్తున్నారు. సిలికాన్, ఆప్టికల్ నెట్‌వర్కింగ్, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో పెట్టుబడులను పెంచడమే సిస్కో లక్ష్యంగా పెట్టుకుంది. తొలగించిన ఉద్యోగులకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు సిస్కో సుమారు 1 బిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ.8,300 కోట్లు కేటాయించింది. అందులో ప్రతిఒక్కరికీ సెవరెన్స్ పే, బోనస్‌లు కూడా ఉన్నాయి.

Next Story