- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Corporate Employees: కార్పొరేట్ ఉద్యోగుల్లో హెల్త్ రిస్క్
కార్పొరేట్ రంగం ప్రతి ఉద్యోగికి సంవత్సరానికి రూ. లక్షకు పైగా నష్టపోతోందని అధ్యయనం తెలిపింది.

దిశ, బిజినెస్ బ్యూరో: ఒక ఉద్యోగి ఆరోగ్యం వ్యాపార వృద్ధిని ప్రభావితం చేస్తుంది. అదేవిధంగా ఒక కంపెనీ మెరుగ్గా కొనసాగితే అది జాతీయ ఆర్థిక వ్యవస్థపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. ఈ నేపథ్యంలో ఉద్యోగుల్లో దీర్ఘకాలిక అనారోగ్యాల కారణంగా భారతీయ కార్పొరేట్ రంగం ప్రతి ఉద్యోగికి సంవత్సరానికి రూ. లక్షకు పైగా నష్టపోతోందని ఓ అధ్యయనం తెలిపింది. అదే కంపెనీలు నిర్మాణాత్మక వెల్‌నెస్ కార్యక్రమాల కోసం ఖర్చు చేయడం ద్వారా 3-4 రెట్లు రాబడిని ఇస్తాయని అభిప్రాయపడింది. అయితే, గత కొంతకాలంగా కార్పొరేట్ రంగంలో ఉద్యోగుల ఆరోగ్యం ఆందోళనకు గురిచేస్తోంది. ఒత్తిడితో కూడిన పనివిధానం, అనారోగ్యానికి గురిచేసే జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఎక్కువ సమయం కూర్చొని పనిచేయడం వల్ల పలు రకాల రోగాలను వారు ఎదుర్కోవాల్సి వస్తోంది.
పరిశ్రమల సంఘం కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ), బెంగళూరుకు చెందిన డిజిటల్ హెల్త్‌కేర్ ప్లాట్‌ఫామ్ మెడిబడ్డీ సంయుక్తంగా విడుదల చేసిన 'వర్క్‌ప్లేస్ హెల్త్ రీఇమాజిన్డ్: కార్పొరేట్ ఇండియాస్ రెడినెస్ ఫర్ డిజిటల్ హెల్త్ లీడర్‌షిప్' నివేదిక ప్రకారం, దేశంలోని ఉద్యోగులలో పెరుగుతున్న అనారోగ్యపై కీలక విషయాలు వెల్లడించింది. ముఖ్యంగా యాజమాన్యాలు ఉద్యోగుల శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరాన్ని హైలైట్ చేసింది. ప్రస్తుతం ఉన్న ధోరణి కొనసాగితే ఉద్యోగులలో ఎక్కువ మంది దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని అధ్యయనం వార్నింగ్ ఇచ్చింది. దానివల్ల ఉద్యోగుల్లో ఉత్పాదకత, జీవన నాణ్యత ప్రభావితం అవుతుందని తెలిపింది.
మారుతున్న పని విధానం కారణంగా 70 శాతం కంటే ఎక్కువ మంది ఉద్యోగులు కనీసం ఒక జీవనశైలి సంబంధిత ఆరోగ్య ప్రమాదాన్ని కలిగి ఉన్నారు. అయితే 20 శాతం మంది కంపెనీలు మాత్రమే ఉద్యోగులకు సాధారణ ఆరోగ్య పరీక్షలను అందిస్తున్నారు. ఉద్యోగుల్లో ఈ ప్రమాదాన్ని తగ్గించేందుకు ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలను నిర్వహించాలని అధ్యయనం సూచించింది. తరచూ ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం ద్వారా ఆహారపు అలవాట్లు, జీవనశైలిని మార్చవచ్చని తెలిపింది.
నివేదికలోని ముఖ్యమైన అంశాలు
* 61 శాతం మంది ఉద్యోగులు అధిక బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ), 21 శాతం మంది అధిక షుగర్ స్థాయిలను ఎదుర్కొంటున్నారు. ఇది మధుమేహం వచ్చే ప్రమాదాన్ని సూచిస్తుంది.
* 15 శాతం మంది ఉద్యోగులకు అధిక రక్తపోటు ఉంది. అయితే 33 శాతం మందిలో అధిక కొలెస్ట్రాల్ వల్ల హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది.
* జీవనశైలి వ్యాధుల్లో ఊబకాయం, మధుమేహం, రక్తపోటు ఉన్నాయి. ఇవి సరిగాలేని జీవనశైలి, సరైన ఆహారం తీసుకోకపోవడం, ఒత్తిడి వల్ల వస్తాయి.
* ఉద్యోగుల్లో ఈ రకమైన అనారోగ్య ప్రమాదం కారణంగా ఉద్యోగి ఉత్పాదకతపై ప్రభావం ఉంటుంది.
కంపెనీల బాధ్యతలు
* ఈ అధ్యయనం ఉద్యోగి శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వడం, వారి శారీరక, మానసిక ఆరోగ్యానికి మద్దతు ఇచ్చే వనరులు అందించాల్సిన ప్రాముఖ్యతను సూచిస్తోంది.
* ఉద్యోగి ఆరోగ్యం, శ్రేయస్సు కోసం కంపెనీల యజమానులు ఆరోగ్య పరీక్షలు, ఫిట్‌నెస్ కార్యక్రమాలు, ఒత్తిడికి సంబంధించిన వర్క్‌షాప్‌లు నిర్వహించాలి.
* ఉద్యోగి ఆరోగ్యం, శ్రేయస్సులో పెట్టుబడి ద్వారా, యజమానులు ఆరోగ్య సంరక్షణ ఖర్చులను తగ్గించవచ్చు, ఉత్పాదకతను, వ్యాపార పనితీరును మెరుగుపరచవచ్చు.






