- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, వెబ్ డెస్క్ : మాంసాహారం ప్రియులకు చికెన్ ధరలు షాక్ ఇచ్చాయి. చలికాల ప్రభావంతో డిమాండ్ పెరగడం వల్ల హైదరాబాద్ మార్కెట్లో స్కిన్‌లెస్ చికెన్ ధర కిలోకు రూ.310 వరకు చేరింది. ఈ సీజన్‌లో ఇదే అత్యధిక ధర అని వ్యాపారులు చెబుతున్నారు. కొత్త సంవత్సరం వేడుకలు పూర్తయ్యినా, సంక్రాంతి పండుగ దగ్గరపడుతుండటంతో డిమాండ్ తగ్గకపోవడం, ఉత్పత్తి ఖర్చులు పెరగడం వల్ల ధరలు ఈ స్థాయికి చేరినట్లు తెలుస్తోంది.
అయితే హైదరాబాద్‌లో చికెన్ ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ, ఇతర ప్రాంతాల్లో గత వారం పోలిస్తే పెద్దగా మార్పు లేదు. హైదరాబాద్‌లో స్కిన్ లెస్ చికెన్ కేజీ రూ.280 నుంచి రూ.310 వరకు, విజయవాడలో రూ.290, గుంటూరు, వరంగల్‌లో రూ.300, విశాఖపట్నంలో రూ.290, ఖమ్మంలో రూ.270 నుంచి రూ.290 వరకు, కామారెడ్డిలో రూ.280 వరకు ఉన్నాయి. చికెన్‌తో పాటు గుడ్ల ధరలు కూడా సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. బయట మార్కెట్లో ఒక్క గుడ్డుకు రూ.8 ఉంది. పండుగ సీజన్ కారణంగా రాబోయే రోజుల్లో ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉండవచ్చని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.






