మీ పాన్ కార్డు వ్యాలిడిటీని ఇలా చెక్ చేసుకోండి!

by Disha Web Desk 17 |
మీ పాన్ కార్డు వ్యాలిడిటీని ఇలా చెక్ చేసుకోండి!
X

దిశ, వెబ్‌డెస్క్: భారతీయ పౌరులందరికి అత్యంత ముఖ్యమైన కార్డులలో పాన్ కార్డు ఒకటి. ఆర్థిక లావాదేవీల నిర్వహణకు పాన్‌ కార్డ్‌ (PAN Card) చాలా అవసరం. అంతటి ముఖ్యమైన పాన్ కార్డును కొంతమంది దొంగ కార్డులను తయారు చేసి ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నారు. దీన్ని గ్రహించిన కేంద్ర ప్రభుత్వం తరుచూ పాన్ కార్డ్‌లను డీయాక్టివేట్ చేస్తుంది. అయితే కొంత మంది తమ పాన్ కార్డును చెక్ చేసుకోవడం మర్చిపోతుంటారు. తమ పాన్ కార్డు డియాక్టివేట్ అయిన విషయం తెలియక లావాదేవీల నిర్వహణలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉండటానికి పాన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు తరుచుగా పాన్ కార్డును చెక్ చేస్తూ ఉండాలి.

పాన్ కార్డును చెక్ చేసుకునే విధానం..

ముందుగా వినియోగదారులు ఆదాయ పన్ను శాఖ ఇ-ఫైలింగ్ వెబ్‌సైట్‌ incometaxindiaefiling.gov.inను ఓపెన్ చేయాలి. హోమ్ పేజీలో లెఫ్ట్ సైడ్ ఉన్న ‘Verify Your PAN Details’ అనే లింక్‌పై క్లిక్ చేయాలి. తర్వాత కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. దాంట్లో పాన్ కార్డ్‌ నంబర్, పేరు ఎంటర్ చేయాలి. తరువాత captcha కోడ్‌ను కూడా ఎంటర్ చేయండి. ఆ తరువాత సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే, పాన్‌కార్డ్ యాక్టివ్‌గా ఉందా లేదా అని చూపిస్తుంది.

SMS ద్వారా తెలుసుకోవాలనుకునే వారు పాన్ కార్డు నంబర్, 56161 నంబర్‌కు మెసేజ్ చేయాలి. ఉదాహరణకు... పాన్ నంబర్ AB12345 అయితే, NSDL PAN AB12345 ఎంటర్ చేసి SMS చేయాలి. దీంతో PAN కార్డ్ యాక్టివ్‌గా ఉందా లేదా అనే విషయం SMS రూపంలో వస్తుంది. ఆదాయ పన్ను శాఖ పాన్‌కార్డ్‌ హోల్డర్స్ తమ పాన్‌ను ఆధార్ కార్డ్‌తో 2023 మార్చి 31లోపు లింక్ చేసుకోవాలని కోరింది.



Next Story