PMMSY: ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (PMMSY) కింద రూ. 2 కోట్ల రుణం పొందే ఛాన్స్..ఇలా అప్లై చేయండి

by Vennela |

PMMSY: కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది.

PMMSY: ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (PMMSY) కింద రూ. 2 కోట్ల రుణం పొందే ఛాన్స్..ఇలా అప్లై చేయండి
X

దిశ, వెబ్ డెస్క్: PMMSY: కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా దేశంలో మత్స్య పరిశ్రమను అభివృద్ధి చేయడం, చేపల ఉత్పత్తి పెంచడం, మత్స్యకారుల ఆదాయాన్ని పెంచడం లక్ష్యంగా ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (PMMSY) ప్రారంభించింది. 2020లో ప్రారంభించిన ఈ స్కీం కోసం కేంద్ర ప్రభుత్వం 20 వేల కోట్ల రూపాయలను కేటాయించింది.

ఈ స్కీంలో భాగంగా మత్స్యకారులు, చేపల పెంపకదారులు, మత్స్య కార్మికులు, మత్స్య విక్రేతలకు రుణాలను సైతం అందిస్తున్నారు. చేపల చెరువుల నిర్మాణంచ హ్యాచరీలు, నర్సరీల ఏర్పాటు, కేజ్ కల్చర్, బయోఫ్లాక్, రీసర్క్యులేటరీ సిస్టమ్స్ వంటి ఆధునిక చేపల పెంపక పద్ధతులతో పాటు, ఐస్ ప్లాంట్స్, కోల్డ్ స్టోరేజీలు, ట్రాన్స్‌పోర్ట్ వాహనాలతో పాటు, సీఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, సీఫుడ్ మార్కెటింగ్ కోసం ఈ రుణాన్ని ఉపయోగించుకోవచ్చు.

PMMSY కింద రూ. 2 కోట్ల వరకు రుణాలను అందిస్తున్నారు. ఇందుకోసం చేపల పెంపకం ప్రాజెక్ట్ ఖర్చులో 40% వరకు సబ్సిడీ కూడా అందిస్తున్నారు. ఇక SC/ST, మహిళ వర్గాలకు చెందిన వారికి సీఫుడ్ కు సంబంధించిన ప్రాజెక్ట్ ఖర్చులో 60% వరకు సబ్సిడీ లభిస్తోంది. ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ ఖాతా, వ్యవసాయ భూమి లేదా చేపల పాండ్ కోసం స్థలం లీజు లేదా పట్టా పత్రాలు, ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR), వ్యాపార రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, స్థానిక మత్స్య శాఖ నుంచి NOC అవసరం అవుతాయి.

చేపల పెంపకం ద్వారా ఆదాయం పొందాలి అనుకునే వారికి ఇది ఒక చక్కటి ఛాయిస్ అని చెప్పవచ్చు. దీని కింద దాదాపు రెండు కోట్ల రూపాయల వరకు రుణం అందిస్తున్నారు. దీంతో పాటు సబ్సిడీ కూడా అందుబాటులో ఉంది. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ pmmsy.dof.gov.in సంప్రదించండి. మీ జిల్లా మత్స్య శాఖ కార్యాలయం, సంబంధిత బ్యాంకు శాఖను సంప్రదించండి. బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ రుణాలను ఎక్కువగా అందిస్తున్నాయి.

Next Story