- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Edible Oil: ద్రవ్యోల్బణ నియంత్రణకు వంటనూనెలపై దిగుమతి సుంకం తగ్గించిన కేంద్రం
పెరుగుతున్న వంట నూనె ధరలపై సమీక్ష అనంతరం కేంద్రం ఈ ప్రకటన విడుదల చేసింది.

దిశ, బిజినెస్ బ్యూరో: ద్రవ్యోల్బణ కట్టడి, దేశీయంగా వంటనూనె శుద్ధిని పెంచే లక్ష్యంతో కేంద్ర కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ముడి పొద్దుతిరుగుడు, సోయాబీన్, పామాయిల్‌లతో సహా ముడి వంట నూనెలపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ (బీసీడీ)ని 20 శాతం నుంచి 10 శాతానికి తగ్గించింది. ఈ నిర్ణయం ముడి వంటనూనె, శుద్ధి చేసిన వంట నూనెల మధ్య సుంకం వ్యత్యాసాన్ని 8.75 శాతం నుంచి 19.25 శాతంగా ఉంటుంది. దీనివల్ల శుద్ధి చేసిన వంటనూనెల దిగుమతులకు తక్కువ డిమాండ్ ఏర్పడుతుంది. పెరుగుతున్న వంట నూనె ధరలపై సమీక్ష అనంతరం కేంద్రం ఈ ప్రకటన విడుదల చేసింది. సవరించిన సుంకం ద్వారా ముడి నూనెల ధరను తగ్గిస్తుందని, వినియోగదారులు కొనుగోలు చేసే రిటైల్ ధరలు కూడా దిగొస్తాయని భావిస్తున్నారు. ప్రభుత్వం గతేడాది సెప్టెంబర్‌లో సుంకాలను పెంచింది. ఈ నిర్ణయంతో అప్పటికే అంతర్జాతీయంగా పెరిగిన దానికి తోడు దేశీయంగా కూడా ధరల పెరుగుదలకు దారితీసింది. ఫలితంగా ఆహార ద్రవ్యోల్బణం కూడా గణనీయంగా పెరిగింది. తాజా బీసీడీ తగ్గింపు ద్వారా వినియోగదారులకు ప్రయోజనాలు అందుతాయని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ(డీఎఫ్‌పీడీ) వెల్లడించింది. ప్రముఖ వంటనూనె సంస్థలు, పరిశ్రమ వాటాదారులతో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశంలో తగ్గిన దిగుమతి ఖర్చులకు అనుగుణంగా డిస్ట్రిబ్యూటర్ల ధర, ఎంఆర్‌పీ ధరలను సవరించాలని కంపెనీలకు డీఎఫ్‌పీడీ సూచించింది.






