- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
GST: జీఎస్టీ 2.0 వల్ల కేంద్రానికి రూ. 47,000 కోట్ల నష్టం
విస్తృతంగా రేట్ల తగ్గింపు వల్ల స్థూలంగా రాబడిపై రూ. 93,300 కోట్ల వరకు ప్రభావం ఉంటుందని అంచనా వేశామని..

దిశ, బిజినెస్ బ్యూరో: ఇటీవల కేంద్రం అమలు చేసిన వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) 2.0 సంస్కరణల కారణంగా ప్రభుత్వానికి సుమారు రూ. 47,000 కోట్ల ఆదాయ నష్టం ఏర్పడుతుందని అంచనా వేసింది. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇటీవల పార్లమెంటులో అడిగిన ప్రశనలకు సమాధానమిచ్చిన మంత్రిత్వ శాఖ.. విస్తృతంగా రేట్ల తగ్గింపు వల్ల స్థూలంగా రాబడిపై రూ. 93,300 కోట్ల వరకు ప్రభావం ఉంటుందని అంచనా వేశామని, కొన్ని వస్తువులను 28 శాతం శ్లాబ్ నుంచి 40 శాతానికి మార్చడం వల్ల రూ. 45,570 కోట్ల అదనపు ఆదాయం సమకూరుతుందని భావిస్తున్నాం. దీనివల్ల మొత్తంగా జీఎస్టీ రేట్ల సంస్కరణల ప్రభావం రూ. 47,700 కోట్ల నష్టానికి పరిమితం అవుతుందని అభిప్రాయపడింది. అయితే, ఈ అంచనాలు కూడా ఖచ్చితమని చెప్పలేమని స్పష్టం చేసింది. పన్ను వసూళ్లు స్థిరంగా ఉండవు, వృద్ధి ఉంటుంది. అంతేకాకుండా, తక్కువ రేట్ల వల్ల మెరుగైన పన్నుల చెల్లింపులు, తక్కువ సవాళ్లు ఉండే అవకాశం ఉందని మంత్రిత్వ శాఖ పేర్కొంది.






