- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Cement Price: ఈ ఏడాది 2-4 శాతం పెరగనున్న సిమెంట్ ధరలు: క్రిసిల్
గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాలు స్పీడ్ అందుకుంటాయని, తద్వారా సిమెంట్ రంగంలో గిరాకీ ఊపందుకుంటుందని క్రిసిల్ పేర్కొంది

దిశ, బిజినెస్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం ప్రధాన మౌలిక సదుపాయాల మంత్రిత్వ శాఖలకు బడ్జెట్ కేటాయింపులు 10 శాతం పెంచిన నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సిమెంట్ రంగంలో డిమాండ్ 6.5-7.5 శాతం పెరుగుతుందని క్రిసిల్ అంచనా వేసింది. బడ్జెట్ కేటాయింపులతో పాటు ఈ ఏడాది రుతుపవనాలు సానుకూలంగా ఉండటం, గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాలు స్పీడ్ అందుకుంటాయని, తద్వారా సిమెంట్ రంగంలో గిరాకీ ఊపందుకుంటుందని క్రిసిల్ తన ఇంటిలిజెన్స్ నివేదికలో పేర్కొంది. దేశీయ సిమెంట్ డిమాండ్‌లో 30 శాతం మేర వాటా కలిగిన మౌలిక సదుపాయాల రంగంలో కేంద్ర ప్రభుత్వం రోడ్లతో పాటు రైల్వే నిర్మాణాలను వేగవంతం చేసింది. ఆ తర్వాత రైల్వేలు, నీటిపారుదల, పట్టణ మౌలిక సదుపాయాలు ఎక్కువ సిమెంట్ వినియోగం కలిగి ఉన్నాయి. ప్రభుత్వ పథకాలు, ఇటీవల కీలక వడ్డీ రేట్లను తగ్గించడం వల్ల పట్టణ ప్రాంతాల్లో గృహ నిర్మాణం మెరుగుపడుతుంది. ప్రధానంగా ప్రధానమైన 12 రాష్ట్రాలు ప్రకటించిన తమ బడ్జెట్‌ల కారణంగా దేశీయ సిమెంట్ డిమాండ్‌లో 63.65 శాతం భర్తీ చేయనున్నాయి. ఇది సిమెంట్ రంగానికి అత్యంత సానుకూలమని, గిరాకీ పుంజుకునేందుకు దోహదపడుతుందని క్రిసిల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ సెహుల్ భట్ చెప్పారు. ఇదే సమయంలో గత రెండేళ్లుగా స్థిరంగా ఉన్న ధరలు కూడా 2-4 శాతం మేర పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని క్రిసిల్ ఇంటెలిజెన్స్ అసోసియేట్ డైరెక్టర్ సచ్చిదానంద్ చౌబే పేర్కొన్నారు.






