Canara Bank: తగ్గనున్న కెనరా బ్యాంక్ ఈఎంఐ భారం

by S Gopi |

వివిధ కాలపరిమితులపై 5 బేసిస్ పాయింట్ల వరకు వడ్డీ రేట్లను కోత విధించినట్టు బుధవారం ప్రకటనలో తెలిపింది.

Canara Bank: తగ్గనున్న కెనరా బ్యాంక్ ఈఎంఐ భారం
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్ మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్స్‌ బేస్డ్‌ లెండింగ్‌ రేటు(ఎంసీఎల్ఆర్) ను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. వివిధ కాలపరిమితులపై 5 బేసిస్ పాయింట్ల వరకు వడ్డీ రేట్లను కోత విధించినట్టు బుధవారం ప్రకటనలో తెలిపింది. ఈ నిర్ణయంతో బ్యాంకు అందించే గృహ, వాహన, వ్యక్తిగత రుణాలపై ఈఎంఐ భారం తగ్గనుంది. సవరించిన రేట్లు నవంబర్ 12 నుంచే అమల్లోకి వస్తాయని బ్యాంకు స్పష్టం చేసింది. కెనరా బ్యాంకు అధికారిక వెబ్‌సైట్ వివరాల ప్రకారం, ఓవర్‌నైట్ ఎంసీఎల్ఆర్‌ను 7.95 శాతం నుంచి 7.90 శాతానికి తగ్గింది. నెలరోజు ఎంసీఎల్ఆర్‌ను 7.95 శాతానికి, మూడు నెలల ఎంసీఎల్ఆర్‌ను 8.15 శాతానికి, ఆరు నెలల ఎంసీఎల్ఆర్‌ను 8.50 శాతానికి సవరించింది. వినియోగదారులు తీసుకునే రిటైల్ రుణాలపై ప్రభావం చూపే ఏడాది కాలవ్యవధి కలిగిన ఎంసీఎల్ఆర్‌ను 8.75 శాతం నుంచి 8.70 శాతానికి తగ్గించింది. రెండేళ్ల ఎంసీఎల్ఆర్‌ను 8.85 శాతానికి, మూడేళ్ల ఎంసీఎల్ఆర్‌ను 8.90 శాతానికి బ్యాంకు తగ్గించింది.

Next Story