- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Mahesh Bank: ఏపీ మహేష్ బ్యాంక్ చైర్మన్‌గా మురళీ మనోహర్ పలోడ్ ఎన్నిక
సోమవారం సహకార ఎన్నికల అథారిటీ నుంచి అధికారిక ఆమోదం లభించడంతో, ఫలితాలు అధికారికంగా వెలువడ్డాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఏపీ మహేష్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ ఛైర్మన్‌గా మురళీ మనోహర్ పలోడ్ ఎన్నికయ్యారు. ఇవే ఎన్నికల్లో గోవింద్ నారాయణ రాఠీ బ్యాంక్ వైస్-ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరి ఎన్నికకు సంబంధించి సోమవారం సహకార ఎన్నికల అథారిటీ నుంచి అధికారిక ఆమోదం లభించడంతో, ఫలితాలు అధికారికంగా వెలువడ్డాయి. సజావుగా, పోటీ లేకుండా జరిగిన ఈ ఎన్నికల ప్రక్రియ బ్యాంకు నిర్వహణ వ్యవహారాల్లో స్థిరత్వం, ఐక్యతను చాటుతోందని బోర్డు మెంబర్లు అభిప్రాయపడ్డారు. ఏపీ మహేష్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ తెలంగాణలోని ప్రముఖ పట్టణ సహకార బ్యాంకులలో ఒకటి. ఈ బ్యాంకు ముఖ్యంగా చిన్న వ్యాపారాలు, వ్యక్తులతో సహా డిపాజిటర్లు, రుణగ్రహీతలకు సేవలు అందిస్తోంది. కొత్తగా ఎన్నికైన నాయకత్వం ఆర్థిక పనితీరును బలోపేతం చేయడం, కస్టమర్ సేవలను మెరుగుపరచడం, నియంత్రణ నిబంధనలను పాటించడంపై దృష్టి సారిస్తుందని భావిస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మురళీ మనోహర్ పలోడ్.. తనపై విశ్వాసం ఉంచి, బ్యాంకు ఛైర్మన్‌గా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు. బాధ్యతలను నెరవేరుస్తూనే, కొత్తగా ఎన్నికైన బోర్డు కస్టమర్లకు మరింత మెరుగ్గా సేవలందించడమే కాకుండా, లావాదేవీల్లో పెరిగిన డిజిటలైజేషన్‌ను మరింత వేగంగా విస్తరిస్తామని అన్నారు. బ్యాంకు వైస్-ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు గోవింద్ నారాయణ్ రాఠీ సంతోషం వ్యక్తం చేశారు.






