Akshaya Tritiya: అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా..అయితే తరుగు, వీఏ పేరిట ఈ మోసం తెలుసుకోండి

by Vennela |

Akshaya Tritiya: అక్షయ తృతీయ సందర్భంగా బంగారం కొనుగోలు చేయడం అనేది ఆనవాయితీగా వస్తుంది.

Akshaya Tritiya: అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా..అయితే తరుగు, వీఏ పేరిట ఈ మోసం తెలుసుకోండి
X

దిశ, వెబ్ డెస్క్: Akshaya Tritiya: అక్షయ తృతీయ సందర్భంగా బంగారం కొనుగోలు చేయడం అనేది ఆనవాయితీగా వస్తుంది. అయితే బంగారం కొనుగోలు చేయడం అనేది ఒక సామాన్యమైన విషయం కాదు చాలా జాగ్రత్తగా అన్ని విషయాలను మేనేజర్ వేసుకొని కొనుగోలు చేయాల్సి ఉంటుంది ఎందుకంటే కొంచెం తేడా వచ్చినా గాని మీరు చాలా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. ఉదాహరణకు మీరు ఒక 10 గ్రాముల బంగారు నగ తీసుకున్నట్లయితే అందులో ఒక గ్రాము తేడా వచ్చినా కానీ మీరు దాదాపు పదివేల రూపాయలు నష్టపోయే ప్రమాదం ఉంటుంది కనుక మీరు బంగారం కొనుగోలు విషయంలో ఏ మాత్రం కూడా ఏమరపాటు అనేది పనికిరాదు దీని గురించి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన మీదటనే మీరు బంగారు ఆభరణం కొనుగోలు చేయాల్సి ఉంటుంది. డిజైన్ కన్నా కూడా క్వాలిటీ అదే విధంగా, బంగారంపై విధిస్తున్న చార్జీల పైన ఎక్కువగా దృష్టి పెట్టాల్సి ఉంటుంది లేకపోతే మీరు పెద్ద మొత్తంలో డబ్బులు ప్రమాదం ఉంటుంది

బంగారం కొనుగోలు చేసేటప్పుడు ఎక్కువగా దుకాణదారులు మూడు విషయాల్లో మిమ్మల్ని మోసం చేసే ప్రమాదం ఉంటుంది అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా తరుగు (wastage), వీఏ (VA – value addition), మజూరీ (making charges) పేరిట . కొంతమంది బంగారు వ్యాపారాలు మిమ్మల్ని మోసం చేసే ప్రమాదం ఉంటుంది కనుక వీటి పైన క్షుణ్ణంగా అన్ని విషయాలు తెలుసుకోవాలి.

1. తరుగు (Wastage Charges):

బంగారు ఆభరణాలను 24 క్యారెట్ల నాణ్యత ఉన్న కాయిన్స్, బిస్కెట్స్ ఉపయోగించి తయారుచేస్తారు. అలాంటి సమయంలో వాటిలో ఇతర లోహాలను కూడా కలుపుతారు అప్పుడు అది 22 క్యారెట్ల బంగారం గా మారుతుంది. ఇక తరుగు విషయానికొస్తే బంగారం ఒక ఆభరణంగా మారుతున్న సమయంలో కాస్త వేస్టేజ్ అనేది ఉంటుంది, తరుగు పేరిట 6 నుంచి 15% మేర షాపుల వారు వసూలు చేస్తుంటారు.

ఉదాహరణకు మీరు 10 గ్రాముల బరువున్న బంగారం చైన్ తీసుకున్నారు అనుకుందాం దాని ధర రూ. 90,000 ఉంటే దాని తరుగు 10% గా ఒకవేళ నిర్ణయించినట్లయితే, మీరు అప్పుడు తొమ్మిది వేల రూపాయలు చెల్లించాలి. అయితే మీరు ఈ తరుగు మీద బేరం ఆడవచ్చు. షాపుల వారిని తగ్గించమని కోరవచ్చు. మీరు మౌనంగా ఉంటే వారు అలానే చార్జీలు వేస్తారు. అలాగే బిల్లులో కూడా తరుగు ఎంత ఉందో రాయమని చెప్పాలి.

2. వీఏ ఛార్జ్ / మజూరీ ఛార్జ్ (Value Addition / Making Charges):

ఇక మేకింగ్ చార్జెస్ వేల్యూ ఎడిషన్ పేరిట కూడా బంగారం ఆభరణాలపై అదనపు భారం వేస్తుంటారు. ఈ వీఐ అనేది 8 శాతం నుంచి 25 శాతం వరకు ఉంటుంది. ఉదాహరణకు మీరు 90000 విలువైన 10 గ్రాముల చైన్ తీసుకున్నట్లయితే దీనిపైన 15% అంటే 13,500 వేల రూపాయల వరకు మీరు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ విఏ చార్జెస్ పైన కూడా మీరు బేరం ఆడవచ్చు. ఈ విఏ అనేది షాపును బట్టి మారుతూ ఉంటుంది కనుక మీరు మీకు నచ్చిన నగలు తక్కువ వేయకు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.

3. ఫిక్స్డ్ రేట్ మోసం:

కొన్ని దుకాణాల వారు తాము నిర్ణయించిన బంగారం రేటు ను పెట్టి మీఏ తక్కువగా ఉందని చెబుతూ ఉంటారు. కానీ ఆరోజు బంగారం ధర ఎంత ఉందో అంత మేర మాత్రమే చెల్లించాల్సి ఉంటుందన్న సంగతి మర్చిపోకూడదు. కనుక మీరు బిల్లులోనే అన్ని విషయాలను బ్రేకప్ రూపంలో పొందాల్సి ఉంటుంది.

4. పాత బంగారం మార్పిడి మోసం:

చాలామంది పాత బంగారు నగలను మార్చి కొత్త బంగారు నగలు అందిస్తామని చెబుతుంటారు కానీ పాత బంగారాన్ని వారు కరిగించే క్రమంలో దాన్ని విలువ తక్కువగా పెడతారు అప్పుడు మీరు అదనంగా డబ్బు చెల్లించాల్సి ఉంటుంది ఈ క్రమంలో మీరు బంగారం నష్టపోయే ప్రమాదం ఉంది పైగా అదనంగా డబ్బు చెల్లించమని కూడా వారు కోరే అవకాశం ఉంటుంది కనుక ఈ విషయాలన్నింటినీ జాగ్రత్తగా గుర్తుంచుకొని పాత బంగారాన్ని వీలైనంతవరకు ఎక్స్చేంజ్ చేయకుండా ఉంచుకునేందుకే ప్రయత్నం చేయండి. ఎందుకంటే బంగారం విలువ రాను రాను పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఎక్స్చేంజ్ ఆఫర్స్ వల్ల మీరు భారీ ఎత్తున నష్టపోయే ప్రమాదం ఉంటుంది. డబ్బు అడ్జస్ట్ కాకపోతే వేరే విధంగా అయినా మీరు డబ్బు చెల్లించి కొత్త నగలను కొనుగోలు చేయండి కానీ పాత నగలను మాత్రం మార్చవద్దని నిపుణులు సలహా ఇస్తున్నారు.

Next Story