- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Gold Price: 'బంగారం'పై బడ్జెట్ పిడుగు.. ఇప్పుడే కొనడం బెటరా.. కొంత కాలం ఆగాల్సిందేనా?
Gold Price: బంగారం కొనుగోలుదారులకు ఇప్పటికే ధరలు భారీగా పెరుగుతు షాక్ ఇస్తున్నాయి.

దిశ,వెబ్‌డెస్క్: Gold Price: బంగారం కొనుగోలుదారులకు ఇప్పటికే ధరలు భారీగా పెరుగుతు షాక్ ఇస్తున్నాయి. ఇప్పుడు మరో పిడుగు పడే ఛాన్స్ కనిపిస్తోంది. వచ్చే వార్షిక బడ్జెట్లో బంగారం, వెండి దిగుమతులపై కస్టమ్ డ్యూటీ పెంచాలని.. కేంద్రంలోని మోదీ సర్కార్ భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఇదే జరిగినట్లయితే బంగారం ధరలు మరింత పెరుగుతాయి. మరి బడ్జెట్ కు ముందే బంగారం కొనుగోలు చేయడం మంచిదా? బులియన్ మార్కెట్ నిపుణులు ఏమంటున్నారు తెలుసుకుందాం.
భారతీయులకు.. బంగారానికి.. విడదీయరాని బంధం ఉంటుంది. పండగలు, శుభకార్యాలు, పెళ్లిళ్లు, పర్వదినాలు ఏవైనా సరే బంగారం వేసుకోవాల్సిందే. మరి ముఖ్యంగా మహిళలు బంగారాన్ని చాలా ఇష్టపడతారు. ఎంత ఎక్కువ బంగారం ఉంటే అంత గౌరవంగా భావిస్తుంటారు. దీంతో మన దేశంలో పెద్ద ఎత్తున బంగారం దిగుమతి అవుతుంది. అయితే ఇటీవల కాలంలో చూసుకుంటే.. బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈ 2025లో తొలి 3 వారాల్లో చూస్తే..బంగారు ధరలు భారీగా పెరిగాయి.
ఇప్పుడు మరో పిడుగు పడేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం బంగారంపై కస్టమ్ డ్యూటీ రూపంలో మరో పిడుగు నెత్తిన పడేసేలా కనిపిస్తోంది. బంగారంపై కస్టమ్ డ్యూటీ పెంపు ప్రకటన చేసే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇదే జరిగితే బంగారం ధరలకు రెక్కలు వస్తాయి. ప్రస్తుతం ఉన్న రేటు వద్ద బంగారం కొనుగోలు చేయడం వ్యూహాత్మక అడుగుగా బులియన్ మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. ఆదివారం జనవరి 19వ తేదీన బంగారం ధరలు స్వల్పంగా దిగి వచ్చాయి. అయినప్పటికీ మళ్లీ పెరగక ముందే కొనుగోలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఒక్కసారిగా బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2024 జులై 23న ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం బంగారం, వెండి దిగుమతులపై కస్టమ్స్ సుంకాన్ని15% నుంచి 6శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే. దీంతో బంగారం ధరలు భారీగా తగ్గి వచ్చాయి. అయితే ఆ తర్వాత ఆగస్టు 2024లో చూస్తే బంగారం దిగుమతులు 14% పెరిగి 10.06 బిలియన్ డాలర్లకు చేరింది. అదే సమయంలో భారతదేశ నుంచి రత్నాలు, నగల ఎగుమతులు 23 శాతానికి పడిపోయాయి. దీంతో 1.99బిలియన్ డాలర్లకు తగ్గినట్లు ఓ నివేదిక పేర్కొంది.
చివరి బడ్జెట్లో కస్టమ్స్ డ్యూటీ తగ్గించి బంగారం ధరలను స్థిరీకరణ చేసేందుకు కేంద్రం ప్రయత్నించింది. అయితే దిగుమతి సుంకాలు తగ్గించడంతో వినియోగం భారీగా పెరిగింది. అది దేశ వాణిజ్య లోటును భారీగా పెంచేసింది. ప్రపంచంలోనే అత్యధిక బంగారం దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో భారతదేశం రెండవ స్థానంలో ఉంది.
గత వారంలో చూస్తే డాలర్ పుంజుకుంటున్నప్పటికీ.. బంగారం ధరలు భారీగానే పెరిగాయి. స్పాట్ మార్కెట్ నుంచి డిమాండ్ ఉండడం డొమెస్టిక్ ఈక్విటీ మార్కెట్లు బలహీనపడడంతో బంగారం ధరలు పెరిగినట్లు నిపుణులు చెబుతున్నారు. గత వారంలో బంగారం 1 శాతం మేర పెరిగాయి. ఎంసీఎక్స్ మార్కెట్లో గత శుక్రవారం బంగారం ధర 10 గ్రాము రూ.79,010 వద్ద ముగిసింది. ఇప్పుడు ప్రభుత్వం కస్టమ్ డ్యూటీ పెంచినట్లయితే బంగారం ధర భారీగా పెరగనుంది. పెరుగుతున్న బంగారం దిగుమతులను నియంత్రించేందుకు కస్టమ్స్ డ్యూటీ పెంచే ఛాన్సే అధికంగా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ఇప్పుడు ధరలు తక్కువగా ఉన్నప్పుడు కొనడమే వ్యూహాత్మక అడుగుగా భావిస్తున్నారు. అయితే బంగారం ధర పెరుగుదలకు కేవలం కస్టమ్స్ డ్యూటీ పెంపు ఒకటే కారణం కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ ప్రభుత్వం కస్టమ్స్ డ్యూటీలో ఎలాంటి మార్పులు చేయకపోయినా.. బంగారం ధరలు మరి పెరిగే అవకాశం ఉందంటున్నారు. ప్రపంచ భౌగోళిక అనిశ్చిత పరిస్థితులు అందుకు కారణం అని చెబుతున్నారు.






