- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్టాక్ మార్కెట్‌లో ‘బుల్’ జోరు.. నిన్నటి నష్టాల నుంచి కోలుకున్న సూచీలు
స్టాక్ మార్కెట్లో మళ్లీ ఆశలు చిగురించాయి. ఇవాళ భారీ లాభాల్లో సెన్సెక్స్, నిఫ్టీలు ట్రేడ్ అవుతున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు, ముడి చమురు ధరలు తగ్గడంతో భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. గురువారం సుమారు 2,400 పాయింట్లకు పైగా కుప్పకూలిన సెన్సెక్స్, నేడు ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో మళ్లీ బౌన్స్ బ్యాక్ అయ్యింది. ఉదయం 9.30 నిమిషాలకు సెన్సెక్స్ 760 పాయింట్లు లాభపడి 74,997 వద్ద ట్రేడవుతోంది. ఇక నిఫ్టీ 251 పాయింట్లకు పెరిగి 23,253 వద్ద కొనసాగుతోంది.
ఇక డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 93 వద్ద ఆల్‌టైమ్ కనిష్టానికి చేరింది. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టే సూచనలు కనిపిస్తుండటంతో బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 106 డాలర్లకు పడిపోయింది. ఇది భారత మార్కెట్‌కు పెద్ద ఊరటనిచ్చింది. నిన్నటి భారీ పతనం తర్వాత అనేక నాణ్యమైన షేర్లు తక్కువ ధరకే లభిస్తుండటంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపారు. ముఖ్యంగా ఐటీ రంగ షేర్లు, ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లు మార్కెట్‌ను ముందుకు నడిపిస్తున్నాయి.
టాప్ గెయినర్స్, లూజర్స్ ఇలా..
మంగళూరు రిఫైనరీ (MRPL), హిందుస్థాన్ పెట్రోలియం (HPCL), కెనరా బ్యాంక్, కియోక్ల్ (KIOCL) షేర్లు లాభాల్లో ఉన్నాయి. అదేవిధంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (HDFC Bank) వరుసగా రెండో రోజు కూడా ఒత్తిడిని ఎదుర్కొంటోంది. నేటి నుంచి కోల్ ఇండియా అనుబంధ సంస్థ CMPDI ఐపీవో సబ్‌స్క్రిప్షన్ ప్రారంభమైంది. దీనిపై గ్రే మార్కెట్‌లో సానుకూల స్పందన కనిపిస్తోంది.






