- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Oracle Layoff: ఏఐ ఒకటే కాదు.. లేఆఫ్స్ వెనుక ఖర్చులూ కారణమే
దీనికి పునర్వ్యవస్థీకరణలో భాగమని కంపెనీ వివరణ ఇచ్చినప్పటికీ, ఏఐ పెట్టుబడులు, ఖర్చు తగ్గింపు కూడా కీలక కారణాలని తెలుస్తోంది.

దిశ, బిజినెస్ బ్యూరో: టెక్ రంగంలో ఉద్యోగాల తొలగింపులు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలోనె ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ 16 వేల మందిని తొలగించిన సంగతి తెలిసిందే. తాజాగా అమెరికా టెక్ దిగ్గజం ఒరాకిల్ ఏకంగా 30 వేల మందిని ఇంటికి సాగనంపింది. ఇందులో మనదేశంలోని 12 వేల మంది ఉద్యోగులు ఉండటం గమనార్హం. మనదేశంతో పాటు అమెరికా, మెక్సికో, కెనడా సహా వివిధ దేశాల్లో కంపెనీలోని మొత్తం ఉద్యోగుల్లో 18 శాతం మందిని లేఆఫ్ చేసినట్టు ఒరాకిల్ ఉద్యోగులకు పంపిన మెయిల్‌లో పేర్కొంది. దీనికి పునర్వ్యవస్థీకరణలో భాగమని కంపెనీ వివరణ ఇచ్చినప్పటికీ, ఏఐ పెట్టుబడులు, ఖర్చు తగ్గింపు కూడా కీలక కారణాలని తెలుస్తోంది. ఈ వ్యవహారానికి సంబంధించి మనీకంట్రోల్ ఉద్యోగులను అడగ్గా, బడ్జెట్ పరిమితుల కారణంగా జరిగినట్టు చెప్పారు. ఎంతమందిని తొలగించాలనే దాని కంటే బడ్జెట్ పాటించాలని టీమ్స్‌ను కోరినట్టు సమాచారం. ఏఐ సంబంధిత ఖర్చులతో కూడా సంబంధం ఉండొచ్చని కొందరు ఉద్యోగులు చెప్పారని మనీకంట్రోల్ పేర్కొంది. ముఖ్యంగా కన్సల్టింగ్, సర్వీసెస్ విభాగాల్లోని ఉద్యోగులు ఎక్కువగా ప్రభావితమయ్యారు. ఇదే సమయంలో కంపెనీకి చెందిన హెల్త్‌కేర్ విభాగం సెర్నర్ విభాగంలోనూ అత్యధిక సంఖ్యలో ఉద్యోగులు కోతలకు గురయ్యారని వెల్లడించారు.






