Nirmala Sitharaman: ప్రజల కోసం, ప్రజల చేత.. బడ్జెట్‌-2025పై నిర్మలా సీతారామన్ స్పందన

by S Gopi |

నిజాయితీగా పన్ను చెల్లించే తమకోసం ఎలాంటి చర్యలు తీసుకుంటారనే ప్రశ్న ఎదురయ్యేది. దీనిపై ప్రధాని మోడీతో విస్తృత చర్చలు..

Nirmala Sitharaman: ప్రజల కోసం, ప్రజల చేత.. బడ్జెట్‌-2025పై నిర్మలా సీతారామన్ స్పందన
X

దిశ, బిజినెస్ బ్యూరో: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్‌పై స్పందించారు. ఈ బడ్జెట్ ప్రజల కోసం, ప్రజల చేత రూపొందించిన బడ్జెట్ అన్నారు. పన్నులు తగ్గించాలనే ఆలోచన వెనుక ప్రధాని నరేంద్ర మోడీ సహకారం ఉందన్నారు. అయితే, పన్ను తగ్గింపులకు సంబంధించి అధికారులను ఒప్పించేందుకు సమయం తీసుకున్నట్టు నిర్మలమ్మ చెప్పారు. ఆదివారం జాతీయ మీడియాతో మాట్లాడిన ఆర్థిక మంత్రి.. నిజాయితీగా పన్నులను చెల్లిస్తున్నప్పటికీ, తమ ఆకాంక్షలు నెరవేరడంలేదనే ఫిర్యాదు తనకు అందుతూనే ఉండేదని, ముఖ్యంగా మధ్యతరగతి ప్రజల నుంచి ఇది ఎక్కువగా వినిపించేదన్నారు. తాను ఎక్కడికీ వెళ్లినా నిజాయితీగా పన్ను చెల్లించే తమకోసం ఎలాంటి చర్యలు తీసుకుంటారనే ప్రశ్న ఎదురయ్యేది. దీనిపై ప్రధాని మోడీతో విస్తృత చర్చలు జరిపిన అనంతరం, ఆయన మార్గనిర్దేశంతో నిర్ణయం తీసుకున్నట్టు ఆర్థిక మంత్రి వివరించారు. ఇదే సమయంలో భారత కరెన్సీ రూపాయి పతనం గురించి స్పందిస్తూ.. రూపాయి బలహీనపడటంపై విమర్శలను తిరస్కరించారు. బలపడుతున్న అమెరికా డాలర్ కారణంగానే రూపాయి క్షీణించిందని, ఇతర దేశాల కరెన్సీలతో పోలిస్తే రూపాయి స్థిరంగా ఉన్నట్టు వివరించారు. గత కొన్ని నెలల్లోనే అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ 3 శాతం మేర క్షీణించిన సంగతి తెలిసిందే. దీనివల్ల దిగుమతులు ఖరీదవుతాయనే ఆందోళనలు ఉన్నాయి.

Next Story