Home Loan: హోమ్‌ లోన్‌ తీసుకునేవారికి గుడ్‌ న్యూస్.. బడ్జెట్‌లో లక్షల రూపాయల సబ్సిడి ప్రకటన!

by Vennela |

Home Loan: బడ్జెట్(Budjet 2025) 2025లో మధ్య తరగతి ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుందా?

Home Loan: హోమ్‌ లోన్‌ తీసుకునేవారికి గుడ్‌ న్యూస్.. బడ్జెట్‌లో లక్షల రూపాయల సబ్సిడి ప్రకటన!
X

దిశ, వెబ్ డెస్క్: Home Loan: బడ్జెట్(Budjet 2025) 2025లో మధ్య తరగతి ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుందా? బడ్జెట్ లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన(Prime Minister Awas Yojana) కింద అందరికీ క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ(Credit Linked Subsidy) మళ్లీ తీసుకొస్తున్నారా? అంటే అవుననే చెబుతున్నారు నిపుణులు. రూ. 2.67లక్షల సబ్సిడీ వచ్చే అవకాశం ఉంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

కేంద్రంలోని మోదీ సర్కార్ వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను 2025-26కి సంబంధించి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంట్ ముందుకు బడ్జెట్ తీసుకురానున్నారు. ఇప్పటికే బడ్జెట్ పద్దులు సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు ఆర్థికశాఖ ఉన్నతాధికారులు. సమయం దగ్గర పడుతున్నా కొద్దీ పలు వర్గాల్లో ఆశలు రెకెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టే బడ్జెట్ పై దేశవ్యాప్తంగా ఉన్న హోంలోన్ తీసుకున్న వారు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. లోన్ ద్వారా ఇంటిని కొనుగోలు చేసినవారికి ఆర్థిక భారం తగ్గించేందుకు పలు పాలసీలు తీసుకువస్తారని భావిస్తున్నారు.

అందులో ప్రధానంగా ఇంటి కొనుగోలుదారులు క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ(Credit Linked Subsidy) స్కీమ్స్ మధ్య తరగతి ప్రజులకు తిరిగి ప్రవేశపెడతారనే ఆశతో ఎదురుచూస్తున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా ఈ స్కీమ్(Prime Minister Awas Yojana) తీసుకువస్తారని అంతా భావిస్తున్నారు. ఈ పథకం వర్తింపజేస్తే హోంలోన్ తీసుకున్న వారిలో అర్హులైన వారికి రూ. 2.67 లక్షల వరకు సబ్సిడీ వస్తుంది. దీంతో కొంత ఆర్థిక భారం తగ్గుతుంది.

అయితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీం(Prime Minister Awas Yojana) కింద హోంలోన్ తీసుకున్నవారిలో అర్హులైన వారికి క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్ ద్వారా ఒక్కో ఇంటికి రూ. 2.67 లక్షల వరకు వడ్డీ సబ్సిడీ లభిస్తుంది. ఈ స్కీమ్ ముఖ్యంగా ఆర్థికంగా వెనబడిన తరగతులు లేదా తక్కువ ఇన్ కమ్ గ్రూప్ మిడిల్ ఇన్ కమ్ గ్రూప్, మిడిల్ ఇన్ కమ్ గ్రూప్ 2కి ఇస్తారు. వారు బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల వంటి వాటి నుంచి హోంలోన్ (Home Loan)తీసుకున్నప్పుడు వర్తిస్తుంది. వారికి హోంలోన్ రూ. 6లక్షలు, రూ. 9లక్షలు, రూ. 12లక్షలు వరకు వరుసగా వడ్డీ రేట్లు 6.5శాతం, 4శాతం, 3శాతం వర్తిస్తాయి. ఇంటికార్పెట్ ఏరియా 60,160, 200స్క్వేర్ మీటర్లు ఉండాలి.

మార్చి 31, 2022న EWS లేదా లోన్ ఇన్ కమ్ గ్రూప్ సెగ్మెంట్ వారికి పీఎంఎవై కింద క్రెడిట్ లింక్డ్ స్కీమ్ వడ్డీ సబ్సిడీని తొలగించారు. అయితే ఆ తర్వాత ఏడాది మళ్లీ తీసుకువచ్చారు. కానీ మిడిల్ ఇన్ కమ్ గ్రూప్ వారికి మార్చి 31, 2021లో ఈ సబ్సిడీ తొలగించి ఇప్పటి వరకు మళ్లీ తీసుకురాలేదు. ఈ క్రమంలో మధ్య తరగతి ప్రజలకు కూడా మళ్లీ ఈ వడ్డీ సబ్సిడీ పునరుద్ధరించాలని కోరుతున్నారు. రియల్ ఎస్టేట్ (Real estate)వర్గాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. వడ్డీ సబ్సిడీ పునరుద్ధరించడం వల్ల కొనుగోళ్లు పెరుగుతాయని చెబుతున్నారు. మరి ఈ బడ్జెట్ లో ఆర్థిక మంత్రి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Next Story