BSNLకు రూ. 52,937 కోట్ల కేటాయింపు!

by Disha Web Desk 17 |
BSNLకు రూ. 52,937 కోట్ల కేటాయింపు!
X

న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ ప్రకటనలో ఆర్థిక మంత్రి ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్‌కు భారీ కేటాయింపులు ప్రకటించారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి బీఎస్ఎన్ఎల్ కోసం ప్రభుత్వం రూ. 52,937 కోట్లను బడ్జెట్‌లో కేటాయించింది. ఈ ఏడాది బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్‌ను 4జీ నుంచి 5జీ అప్‌గ్రేడ్ చేయడంతో పాటు దేశవ్యాప్తంగా ల్యాండ్‌లైన్ నెట్‌వర్క్‌ను పునరుద్ధరించడానికి ఈ నిధులను వినియోగించనున్నట్టు కేంద్ర ఐటీ, టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం ప్రకటనలో తెలిపారు.

ఈ మొత్తం గత ఏడాది ప్రకటించిన రూ. 1.64 లక్షల కోట్ల పునరుద్ధరణ ప్యాకేజీలో భాగమని ఆయన పేర్కొన్నారు. తాజా బడ్జెట్‌లో బీఎస్ఎన్ఎల్‌కు మూలధన కేటాయింపును రూ. 33.269 కోట్లకు తగ్గించింది. అదే విధంగా ఉద్యోగులకు అందిస్తున్న స్వచ్ఛంద పదవీ విరమణ పథకం మొత్తాన్ని రూ. 3,300 కోట్లు కేటాయించింది. గత ఏడాది జులైలో ప్రభుత్వం బీఎస్ఎన్ఎల్ కోసం రూ. 1.64 లక్షల కోట్ల పునరుద్ధరణ ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిందే.


Next Story

Most Viewed