BSNL: ఎనిమిది నెలల్లో 5జీకి అప్‌గ్రేడ్ కానున్న అన్ని బీఎస్ఎన్ఎల్ 4జీ టవర్లు

by S Gopi |

గత నెల 92,500 బీఎస్ఎన్ఎల్ 4జీ టవర్లు పూర్తిగా దేశీయంగా అభివృద్ధి చేసిన సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ పరికరాలతో ఏర్పాటయ్యాయి.

BSNL: ఎనిమిది నెలల్లో 5జీకి అప్‌గ్రేడ్ కానున్న అన్ని బీఎస్ఎన్ఎల్ 4జీ టవర్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) మరో ఆరు నుంచి ఎనిమిది నెలల్లో తన అన్ని 4జీ టవర్లను 5జీకి అప్‌గ్రేడ్ చేస్తుందని కేంద్ర టెలికమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. ఆదివారం కౌటిల్య ఎకనామిక్ కాన్‌క్లేవ్ యొక్క నాల్గవ ఎడిషన్‌లో మాట్లాడిన ఆయన.. గత నెల ఆఖరి వారంలో 92,500 బీఎస్ఎన్ఎల్ 4జీ టవర్లు పూర్తిగా దేశీయంగా అభివృద్ధి చేసిన సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ పరికరాలతో ఏర్పాటు అయ్యాయి. సాధారణంగా విదేశీ కంపెనీల నుంచి పరికరాలను కొనుగోలు చేయడం సులభమైన మార్గం. కానీ, స్వంతంగా 4జీ పరికరాలు, టెక్నాలజీ రూపొందించడం అత్యంత క్లిష్టమైన ప్రక్రియ. అయినప్పటికీ కేవలం 22 నెలల వ్యవధిలోనే బీఎస్ఎన్ఎల్ స్వంత సాఫ్ట్‌వేర్, స్వంత రేడియో యాక్సెస్ నెట్‌వర్క్(ర్యాన్)లను అభివృద్ధి చేశామని మంత్రి తెలిపారు.

అక్టోబర్ 1తో బీఎస్ఎన్ఎల్ 25 ఏళ్ల టెలికాం సేవలను పూర్తి చేసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 5,000 కోట్ల నిర్వహణ లాభాలను సాధించింది. ఇది గతేడాది కంటే రెట్టింపు కంటే ఎక్కువ పెరిగింది. అంతేకాకుండా సబ్‌స్క్రైబర్ల సంఖ్య 8.7 కోట్ల నుంచి 9.1 కోట్లకు పెరిగిందని, దేశవ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్ 2.2 కోట్ల మందికి సేవలందిస్తోందని మంత్రి వివరించారు. రానున్న రోజుల్లో కృత్రిమ మేధస్స్సు(ఏఐ) ఉపయోగించడంలో ఉన్న రక్షణ, ఫైర్‌వాల్స్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం డిజిటల్ కస్టమర్ల చార్టర్‌ను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.

Next Story