- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BSNL : కస్టమర్లకు BSNL గుడ్ న్యూస్
by Muthe.Rajitha |
ప్రభుత్వ రంగ టెలికాం బీఎస్ఎన్ఎల్(BSNL) కస్టమర్లకు గుడ్ న్యూస్ అందించింది.

X
దిశ, వెబ్ డెస్క్ : ప్రభుత్వ రంగ టెలికాం బీఎస్ఎన్ఎల్(BSNL) కస్టమర్లకు గుడ్ న్యూస్ అందించింది. కొత్త కస్టమర్లను ఆకర్షించేందుకు రంగం సిద్ధం చేసింది. బీఎస్ఎన్ఎల్ యూజర్స్ కి అతి తక్కువ ధరకే ప్లాన్స్ అందుబాటులోకి తెచ్చినప్పటికీ.. 4G టవర్స్(4G Towers) లేనందున వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయంపై దృష్టి సారించింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు దేశంలో 65 వేలకు పైగా 4G టవర్లను ఏర్పాటు చేసింది. తెలంగాణ(Telangana)లో ఏకంగా 2 వేలకు పైగా టవర్లను ఏర్పాటు చేసినట్టు సంస్థ ప్రకటించగా.. వాటిలో హైదరాబాద్ లో 675, రంగారెడ్డిలో 100, మెదక్ లో 158, నల్గొండలో 202, మహబూబ్ నగర్లో 151, అదిలాబాద్ లో 141, నిజామాబాద్ లో 113, కరీంనగర్లో 98, వరంగల్ లో 231, ఖమ్మంలో 219 ఏర్పాటు చేశారు.
Next Story






