బీఎస్ఎన్ఎల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఆ ప్లాన్ మరో 15 రోజులు పొడిగింపు

by Naga Rani Yarlagadda |

ప్రభుత్వ రంగ టెలీకాం సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ (BSNL) తన యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది.

బీఎస్ఎన్ఎల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఆ ప్లాన్ మరో 15 రోజులు పొడిగింపు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రభుత్వ రంగ టెలీకాం సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ (BSNL) తన యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టునెలలో ఒక్కరూపాయికే అపరిమిత సేవలను అందిస్తూ.. స్పెషల్ ఆఫర్ తీసుకువచ్చింది. ఆగస్టు 1 నుంచి 31 వరకూ మాత్రమే ఈ ప్లాన్ అందుబాటులో ఉంటుందని ప్రకటించిన బీఎస్ఎన్ఎల్.. తాజాగా ఆ గడువును పొడిగించింది.

ఆజాదీ కా ప్లాన్ (Azadi ka Plan) పేరుతో తీసుకువచ్చిన ఈ ఆఫర్ ను సెప్టెంబర్ 15వ తేదీ వరకూ అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపింది. ఈ ప్లాన్ కింద రీఛార్జ్ చేసుకుంటే.. ఒక్క రూపాయికే (One Rupee Rechage) నెలరోజులపాటు అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, ప్రతిరోజూ 2 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్ లు లభిస్తాయి. అంతేకాదు.. 4 జీబీ సిమ్ ను కూడా ఫ్రీగా అందిస్తోంది బీఎస్ఎన్ఎల్. వినియోగదారుల్ని పెంచుకోవడమే లక్ష్యంగా ఎప్పటికప్పుడే కొత్త ప్లాన్స్ తీసుకొస్తోంది బీఎస్ఎన్ఎల్. మిగతా నెట్వర్క్ లలో ఇవన్నీ ఉండే ప్లాన్స్ సుమారు రూ.300 నుంచి ప్రారంభమై రూ.390 వరకూ ఉన్నాయి. బీఎస్ఎన్ఎల్ ఆజాదీ కా ప్లాన్‌ను పొడిగించడంతో యూజర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. రూ.1కే ఈ సేవల్ని పొందాలంటే యూజర్లు సమీపంలోని బీఎస్ఎన్ఎల్ కస్టమర్ సర్వీస్ సెంటర్ లేదా అధికారిక రిటైలర్ ను సంప్రదించాల్సి ఉంటుంది.

Next Story