- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BSNL: బీఎస్ఎన్ఎల్ ప్రవేటీకరణ ప్రసక్తే లేదు: జ్యోతిరాధిత్య సింధియా
బీఎస్ఎన్ఎల్ దేశ ప్రజలకు చెందినది, ప్రజల కోసమే పనిచేస్తుందన్నారు

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్)ను ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా బుధవారం స్పష్టం చేశారు. ఈ సంస్థ ప్రభుత్వ యాజమాన్యంలోనే కొనసాగుతుందని ఆయన లోక్‌సభకు తెలియజేశారు. బీఎస్ఎన్ఎల్ దేశ ప్రజలకు చెందినది, ప్రజల కోసమే పనిచేస్తుందన్నారు. సంస్థను బలోపేతం చేయడంపై, టెలికాం సామర్థ్యాలను విస్తరించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. బీఎస్ఎన్ఎల్ 4జీ నెట్‌వర్క్ విస్తరణకు సంబంధించి నెట్‌వర్క్ సేవలను అందించడమే కాకుండా, పరికరాలను కూడా స్వయంగా తయారు చేయాలని నిర్ణయించామన్నారు. ఇదే అంశంపై రాజ్యసభలో మాట్లాడిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ప్రభుత్వం బీఎస్ఎన్ఎల్ పునరుద్ధరణ కోసం రూ. 3.22 లక్షల కోట్ల ప్యాకేజీని అందించిందన్నారు. స్పెక్ట్రమ్ కేటాయింపు, మౌలిక సదుపాయాలపై మూలధన వ్యయం, ఏజీఆర్ బకాయిలు, పీఎస్‌యూ పునర్నిర్మాణం వంటి వాటిని కలుపుకొని 2022-2023 మధ్య కాలంలో రూ. 2.26 లక్షల కోట్ల మూలధనాన్ని అందించినట్లు ఆమె పేర్కొన్నారు.






