- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BREAKING: మరోసారి భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
సంక్రాంతి పండుగ వేళ బంగారం, వెండి ధరలు షాకిస్తున్నాయి. పండుగ సమయంలో బంగారం కొనుగోలు చేస్తుంటారు.

దిశ, వెబ్‌డెస్క్: సంక్రాంతి పండుగ వేళ బంగారం, వెండి ధరలు షాకిస్తున్నాయి. పండుగ సమయంలో బంగారం కొనుగోలు చేస్తుంటారు. ఈ సమయంలో ధరలు భారీగా పెరుగుతుండటంతో కొనుగోలుదారులకు కాస్త కష్టతరమైన విషయమే. గడిచిన వారంరోజుల్లో బంగారం ధర రూ.4600కు పైగా పెరిగింది. సోమవారం కూడా బంగారం ధరల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. 24 క్యారెట్ల 10 బంగారం ధర రూ.1690 పెరిగి రూ.1,42,150కి చేరింది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.1550 పెరిగి రూ.1,30,300 పలుకుతోంది. 18 క్యారెట్ల బంగారం ధర కూడా భారీగా పెరిగింది. 10 గ్రాముల బంగారం రూ.1270 పెరిగి రూ.1,06,610కి చేరింది.
ఏకంగా రూ.12వేలు పెరిగిన వెండి
ఇక వెండి ధరల విషయానికొస్తే.. ఆకాశం కూడా హద్దు కాదన్నట్లుగా ఎగబాకుతోంది. గతవారంలో వెండి ధరల్లో స్వల్ప హెచ్చుతగ్గులు చోటుచేసుకున్నాయి. వెరసి మొత్తంగా వారంరోజుల్లో రూ.18 వేలు పెరిగింది. సోమవారం కిలో వెండి ధర రూ.12,000 పెరిగి రూ. 2,87,000కు చేరింది. త్వరలోనే కిలో వెండి ధర రూ.3,00,000కు చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు నిపుణులు. హద్దే లేదన్నట్టుగా పెరుగుతున్న వెండి ధరలు చూసి.. కొనాలంటేనే జంకుతున్నారు. ఈ బంగారం, వెండి ధరలు ఇప్పటికే సామాన్యుడికి అందనిద్రాక్షగా మారాయి.
READ MORE .....






