BMW India: దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఒకే ధరకు బీఎండబ్ల్యూ ఈవీ ఐ7 కారు

by S Gopi |

కస్టమర్లు ఇకపై రిజిస్ట్రేషన్ ఖర్చులు కూడా చెల్లించాల్సిన అవసరం ఉండదు.

BMW India: దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఒకే ధరకు బీఎండబ్ల్యూ ఈవీ ఐ7 కారు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. తన కొత్త ఎలక్ట్రిక్ సెడాన్ మోడల్ బీఎండబ్ల్యూ ఐ7ను దేశవ్యాప్తంగా ఒకే ధరకు విక్రయించాలని నిర్ణయించినట్టు మంగళవారం ప్రకటించింది. ఈ నిర్ణయంతో కారును రిజిస్ట్రేషన్ ఛార్జీలు, జీఎస్టీ, పరిహార సెస్ కలిపి ఎక్స్‌షోరూమ్ ధర రూ. 2.05 కోట్లకు విక్రయంచనుంది. అంటే కస్టమర్లు ఇకపై రిజిస్ట్రేషన్ ఖర్చులు కూడా చెల్లించాల్సిన అవసరం ఉండదు. సాధారణంగా దేశవ్యాప్తంగా రాష్ట్రాన్ని బట్టి రిజిస్ట్రేషన్ ఖర్లు వేర్వేరుగా ఉంటాయి. కొన్నిసార్లు రాష్ట్రాల్లో ఒక్కో సమయంలో ఒక్కో ధర కూడా ఉంటుంది. ఈ వ్యత్యాసాన్ని నివారించడానికి బీఎండబ్ల్యూ ఇండియా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో యూనిఫామ్ ఎక్స్‌షోరూమ్ ధరకు ఐ7 కారును విక్రయించనున్నట్టు కంపెనీ సీఈఓ విక్రమ్ పవా చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్ పన్నులో తేడాతో సంబంధం లేకుండా ఒకే ధరకు కారు లభిస్తుందని ఆయన తెలిపారు. కొనుగోలు చేసే రాష్ట్రంలో పన్ను వేరుగా ఉన్నప్పటికీ, దాన్ని కంపెనీయే భరిస్తుంది. ఇకపై కస్టమర్లు ఇన్సూరెన్స్, స్థానిక సెస్, టీసీఎస్ ఖర్చులను మాత్రమే చెల్లిస్తే సరిపోతుందని కంపెనీ వెల్లడించింది.

Next Story