BMW: బలహీన రూపాయి కారణంగా జనవరి నుంచి బీఎండబ్ల్యూ కార్ల ధరల పెంపు

by S Gopi |

జనవరి నుంచి ఈ పెంపు అమలుకు సన్నాహాలు చేస్తున్నట్టు కంపెనీ అధ్యక్షుడు, సీఈఓ హర్దీప్ సింగ్ బ్రార్ గురువారం తెలిపారు.

BMW: బలహీన రూపాయి కారణంగా జనవరి నుంచి బీఎండబ్ల్యూ కార్ల ధరల పెంపు
X

దిశ, బిజినెస్ బ్యూరో: యూరోతో పోలిస్తే బలహీనపడిన రూపాయి బలహీనతను భర్తీ చేసేందుకు జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ తన కార్ల ధరలు పెంచాలని భావిస్తోంది. కొత్త ఏడాది ప్రారంభం నుంచి ఈ పెంపు అమలుకు సన్నాహాలు చేస్తున్నట్టు కంపెనీ అధ్యక్షుడు, సీఈఓ హర్దీప్ సింగ్ బ్రార్ గురువారం తెలిపారు. ఫారెక్స్ హెచ్చుతగ్గులు కొనసాగుతుండటం, ప్రపంచ సరఫరా గొలుసులో నెలకొన్న ప్రతికూల ప్రభావం కారణంగా ఇదివరకు ధరలను 3 శాతం వరకు పెంచుతామని కంపెనీ ప్రకటించింది. అయితేం ఈసారి ఎంత మేర పెంపు ఉంటుందనే దానిపై కంపెనీ స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుతం కంపెనీ దేశీయ మార్కెట్లో రూ. 45.3 లక్షల మొదలుకొని రూ. 2.54 కోట్ల మధ్య ఇంధన వహనాలతో పాటు ఎలక్ట్రిక్ వాహనల(ఈవీ)ను విక్రయిస్తోంది. ఫారెక్స్ హెచ్చుతగ్గులు ఎక్కువ నష్టం కలిగిస్తాయి. ఈ ఏడాది యూరోతో పోలిస్తే రూపాయి మారకం విలువ అధికంగా ఉంది. ఈ ఏడాదిలో మా అంచనాల కంటే 10 శాతం ఎక్కువ క్షీణత కారణంగా కార్ల ధరలు, లాభదాయకతపై ఒత్తిడిని ఎదుర్కొంటున్నామని హర్దీప్ సింగ్ వివరించారు. వాస్తవానికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన జీఎస్టీ 2.0 సంస్కరణల కారణంగా ధరలను పెంచాలని అనుకోలేదు. కానీ, రూపాయి బలహీనపడటం లాభదాయకతపై ఎక్కువ ఒత్తిడి వల్ల తప్పట్లేదని పేర్కొన్నారు.

Next Story