BMW India: సెప్టెంబర్ నుంచి బీఎండబ్ల్యూ కార్లు ప్రియం

by S Gopi |

ఈ కారణంగానే తప్పనిసరిగా కొంత భారం వినియోగదారులకు బదిలీ చేయాల్సి వస్తోందని కంపెనీ వెల్లడించింది.

BMW India: సెప్టెంబర్ నుంచి బీఎండబ్ల్యూ కార్లు ప్రియం
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ప్రీమియం కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ ఇండియా కార్ల ధరలు పెంచింది. కంపెనీ పోర్ట్‌ఫోలియోలోని అన్ని కార్ల ధరలను సెప్టెంబర్ 1 నుంచి 3 శాతం పెంచుతున్నట్టు అధికారిక ప్రకటనలో వెల్లడించింది. ఫారెక్స్ నిల్వల్లో నిరంతర హెచ్చుతగ్గులు, ప్రపంచ సరఫరాలో నెలకొన్న అనిశ్చితి కారణంగా ప్రతికూల పరిస్థితులు ఉన్నాయని, ఖర్చులు పెరుగుతున్నాయని కంపెనీ వివరించింది. ఈ కారణంగానే తప్పనిసరిగా కొంత భారం వినియోగదారులకు బదిలీ చేయాల్సి వస్తోందని కంపెనీ వెల్లడించింది. ఈ ఏడాది ప్రథమార్థంలో అమ్మకాలు ఆశాజనకంగానే ఉన్నాయి. కానీ, విదేశీ మారక ద్రవ్యం తీవ్రంగా హెచ్చుతగ్గులకు లోనవుతోంది. గ్లోబల్ సప్లైలో సైతం సవాళ్ల కారణంగా విడి పరికారాలు, లాజిస్టిక్స్ ఖర్చులు పెరుగుతున్నాయని బీఎండబ్ల్యూ ఇండియా ప్రెసిడెంట్ అండ్ సీఈఓ విక్రమ్ పవా అన్నారు. కాగా, ఈ ఏడాది భారత మార్కెట్లో పండుగ సీజన్‌ కోసం కొత్త మోడళ్లను లాంచ్ చేస్తామని ఆయన పేర్కొన్నారు.

Next Story