మూడేళ్లలో రెట్టింపు ఏసీ ఎగుమతుల లక్ష్యం!

by Disha Web Desk 23 |
మూడేళ్లలో రెట్టింపు ఏసీ ఎగుమతుల లక్ష్యం!
X

న్యూఢిల్లీ: ఏసీ తయారీ సంస్థ బ్లూస్టార్ అంతర్జాతీయ మార్కెట్లలలో మరింత విస్తరించాలని భావిస్తోంది. అందుకోసం రాబోయే మూడేళ్ల కాలంలో కంపెనీ తన ఎగుమతులను రెట్టింపు చేయాలని లక్ష్యంగా ఉన్నట్టు బ్లూస్టార్ మేనేజింగ్ డైరెక్టర్ బి త్యాగరాజన్ చెప్పారు. ప్రస్తుతం కంపెనీ ఎగుమతులు రూ. 800 కోట్ల వరకు ఉన్నాయని, మూడేళ్లలో దీన్ని రూ. 1,600 కోట్లకు చేర్చాలని భావిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఇప్పటివరకు తూర్పు ఆసియాలో మాత్రమే కంపెనీ కార్యకలాపాలను కలిగి ఉంది. ఈ ఏడాది యూఎస్, జపాన్, యూరప్ దేశాల్లో కొత్త కార్యాలయాలను ప్రారంభించాం. ఈ నేపథ్యంలో గ్లోబల్ మార్కెట్లలో మరింత దూకుడు పెంచాలని బ్లూస్టార్ వెల్లడించింది. కరోనా తర్వాత చైనా కాకుండా భారత బ్రాండ్లను అంతర్జాతీయ వినియోగదారులు ఇష్టపడుతున్నారు. దాన్ని దృష్టిలో ఉంచుకునే కంపెనీ విస్తరణ ప్రణాళికను కలిగి ఉందని త్యాగరాజన్ అన్నారు. భారత్‌తో పోలిస్తే అమెరికా, యూరప్‌లలో ఎయిర్ కండీషనర్(ఏసీ) మార్కెట్ చాలా పెద్దది. ఈ ఏడాది కంపెనీ బెంగళూరు మెట్రో నుంచి మాత్రమే రూ. 500 కోట్ల కంటే ఎక్కువ విలువైన ఆర్డర్‌ను పొదినట్టు బ్లూస్టార్ తెలిపింది. కార్యకలాపాలతో పాటు కంపెనీ 8,000 మంది డీలర్ నెట్‌వర్క్ కలిగి ఉంది. ఈ ఏడాది దాన్ని 10 వేలకు పెంచనున్నట్టు కంపెనీ పేర్కొంది.

Also Read..

పోయిన మొబైల్‌ఫోన్‌లను ట్రాక్ చేసేందుకు కొత్త వ్యవస్థ!



Next Story

Most Viewed