- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Trai: స్పామ్ కాల్స్‌ను బ్లాక్ చేస్తే సరిపోదు: ట్రాయ్ స్పష్టత
ఫిర్యాదుల ద్వారా ఇప్పటివరకు సుమరు 21 లక్షల మొబైల్ నంబర్లను నిషేధం విధించాం

దిశ, బిజినెస్ బ్యూరో: స్పామ్ కాల్స్‌కు సంబంధించి టెలికాం నియంత్రణ సంస్థ కీలక ప్రకటన చేసింది. మొబైల్‌ఫోన్‌కు వచ్చే స్పామ్ కాల్స్, మెసేజ్‌లను బ్లాక్ చేస్తే సరిపోదని, తప్పనిసరిగా డీఎన్‌డీ యాప్ నుంచి రిపోర్ట్ చేసి తీరాలని సోమవారం ప్రకటనలో స్పష్టం చేసింది. సబ్‌స్క్రైబర్లు ఇచ్చిన ఫిర్యాదుల ద్వారా ఇప్పటివరకు సుమరు 21 లక్షల మొబైల్ నంబర్లను నిషేధం విధించాం. ఈ ఫిర్యాదులన్నీ డీఎన్‌డీ యాప్ నుంచే వచ్చాయి. అప్పుడే తాము కూడా చర్యలు తీసుకుంటాం. కేవలం మొబైల్స్‌లో సదరు స్పామ్ కాల్స్, మెసేజ్‌లను బ్లాక్ చేస్తే పరిష్కారం ఉండదు. డీఎన్‌డీ ద్వారా ఫిర్యాదు చేయడంతోనే ఆయా నంబర్లను గుర్తించి శాశ్వతంగా నిషేధించడానికి వీలుంటుందని ట్రాయ్ తెలిపింది. కాబట్టి యూజర్లు డీఎన్‌డీ యాప్ నుంచి స్పామ్ కాల్స్, ఎస్సెమ్మెస్‌ల గురించి ఫిర్యాదు ఇవ్వాలని ట్రాయ్ సబ్‌స్క్రైబర్లను కోరింది. వ్యక్తిగతంగా తమ మొబైల్స్‌లో నంబర్లను బ్లాక్ చేసి ఊరుకోవద్దని అధికారిక ప్రకటనలో స్పష్టం చేసింది. యూజర్లు డీఎన్‌డీ యాప్‌లో నంబర్‌ను రిజిస్టర్ చేసుకోవాలని, ఆ తర్వాత కాల్ లాగ్‌లో స్పామ్ కాల్స్, మెసేజ్‌లను ఎంచుకుని 1909కి రిపోర్ట్ చేయాలని తెలిపింది. ఈ పక్రియ పూర్తయిన తర్వాత అక్‌నాలెడ్జ్‌మెంట్ వస్తుంది. ఇది భవిష్యత్తుల్లో ఫిర్యాదు స్టేటస్ చూసుకునేందుకు ఉపయోగపడుతుంది. సంచార్ సాథి వెబ్‌సైట్ నుంచి కూడా ఫిర్యాదు చేయవచ్చని ట్రాప్ పేర్కొంది.






