- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Blinkit: 10 నిమిషాల్లో కళ్లద్దాలు డెలివరీ చేయనున్న బ్లింకిట్
ఇకమీదట కంపెనీ కళ్లద్దాలను కూడా 10 నిమిషాల్లోనే డెలివరీ చేస్తామని శుక్రవారం ప్రకటించింది.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో క్విక్ కామర్స్ సేవలు అత్యంత వేగంగా విస్తరిస్తున్నాయి. కిరాణా సరుకులు మొదలు ఎలక్ట్రానిక్ పరికరాల వరకు ఇప్పుడు అత్యంత వేగంగా, తక్కువ సమయంలో డెలివరీలు అందించేందుకు కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో క్విక్ కామర్స్ విభాగంలో పోటీని తట్టుకునేందుకు ప్రముఖ క్విక్ కామర్స్ కంపెనీ బ్లింక్ఇట్ కీలక ప్రకటన చేసింది. ఇకమీదట కంపెనీ కళ్లద్దాలను కూడా 10 నిమిషాల్లోనే డెలివరీ చేస్తామని శుక్రవారం ప్రకటించింది. దీనికోసం ప్రముఖ కళ్లద్దాల ప్లాట్‌ఫామ్ లెన్స్‌కార్ట్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. బ్లింక్ఇట్ యాప్ నుంచి లెన్స్‌కార్ట్‌కు చెందిన -0.25 నుంచి -1.5 వరకు పవర్ కళ్లద్దాలను, ఎంపిక చేసిన కలర్ ఫ్రేమ్‌ను, ప్రిస్క్రిప్షన్ లేకుండానే 10 నిమిషాల్లో వినియోగదారులకు చేరవేస్తామని బ్లింక్ఇట్ సీఈఓ అల్బీందర్ దిండ్సా వెల్లడించారు. అయితే, ప్రస్తుతం కళ్లద్దాల క్విక్ డెలివరీ సేవలు బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ-ఎన్‌సీఆర్, ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయని, త్వరలో దేశవ్యాప్తంగా మిగిలిన నగరాలకు కూడా విస్తరిస్తామని కంపెనీ పేర్కొంది. ఈ ఏడాది ఏప్రిల్‌లోనే బ్లింక్ఇట్ ఎంపిక చేసిన నగరాల్లో రూ. 49 రుసుముతో ఎయిర్‌టెల్ సిమ్ కార్డులను 10 నిమిషాల్లో డోర్‌స్టెప్ డెలివరీ చేయడం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సేవలతో కస్టమర్లు ఆధార్ ఆధారిత డిజిటల్ కేవైసీతో వారి సిమ్‌ను యాక్టివేట్ చేసుకోవడానికి వీలవుతుంది. తద్వారా పేపర్‌వర్క్ అవసరాన్ని తగ్గిస్తుంది.






