- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Black Friday Sale: బ్లాక్ ఫ్రైడే బంపర్ ఆఫర్లు.. ఐఫోన్ 16, శాంసంగ్ ఫోల్డ్ ఫోన్స్‌పై భారీ డిస్కౌంట్లు
గతేడాది విడుదలైన యాపిల్ ప్రీమియం ఫోన్ ఐఫోన్ 16 క్రోమాలో రూ. 62,490కే(బ్యాంక్ ఆఫర్లు కలిపి) లభిస్తోంది.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా పండుగ సీజన్ కోసం భారీ ఆఫర్లు తెచ్చిన ఈ-కామర్స్, రిటైల్ స్టోర్లు మరోసారి కస్టమర్ల కోసం ఆఫర్లు ప్రకటించాయి. ఈ ఏడాది బ్లాక్ ఫ్రైడే సందర్భంగా సేల్ ప్రకటించిన ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు ప్రీమియం స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లు, ఇతర డీల్స్ అందిస్తున్నాయి. ముఖ్యంగా గతేడాది విడుదలైన యాపిల్ ప్రీమియం ఫోన్ ఐఫోన్ 16 క్రోమాలో రూ. 62,490కే(బ్యాంక్ ఆఫర్లు కలిపి) లభిస్తోంది. అలాగే, శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ఆల్ట్రా, గెలాక్సీ జీ-సిరీస్ ఫోల్డబుల్ ఫోన్స్, నథింగ్ ఫోన్ 3 సహా ఇతర ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లపై ఆకట్టుకునే రీతిలో రాయితీలను ప్రకటించాయి. ఇవి అమెజాన్,ఫ్లిప్‌కార్ట్, ఇతర ప్లాట్‌ఫామ్‌లలో తక్కువ ధరకే లభిస్తున్నాయి.
వివరాల్లోకి వెళ్తే..టాటా గ్రూపునకు చెందిన ప్రీమియం స్టోర్ క్రోమాలో బ్లాక్ ఫ్రైడే సందర్భంగా ఐఫోన్ 16ని రూ. 66,490 నుంచే అందుబాటులో ఉంచింది. ఇది ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల నుంచి కొంటే మరో రూ. 4 వేల తగ్గింపు ఆఫర్‌తో రూ. 62,490కి లభిస్తుంది. ఎక్స్ఛేంజ్, నో-కాస్ట్ ఈఎంఐ ద్వారా కొనవచ్చు. దీని అసలు ధర రూ. 79,900గా ఉంది.
ఇక, శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ఆల్ట్రా అమెజాన్‌లో అసలు ధర రూ. 1,29,999 కంటే తక్కువగా రూ. 84,999కి సేల్‌లో ఉంది. అదనంగా క్యాష్‌బ్యాక్, నో-కాస్ట్ ఈఎంఐ కూడా ఉంది. శాంసంగ్ ప్రీమియం ఫోన్ జీ-ఫోల్డ్6 ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 1,03,890కే లభిస్తోంది. ఈ ఫోన్ లాంచ్ అయిన సమయంలో దీని ధర రూ. 1,64,999గా ఉంది. అదనంగా క్యాష్‌బ్యాక్ ఆఫర్ వర్తిస్తుంది. జీ-ఫ్లిప్ 6 సంగతికొస్తే.. లాంచి అయిన సమయంలో రూ. 1,09,999తో మార్కెట్లోకి రాగా, ఇప్పుడు అమెజాన్‌లో ఇది రూ. 67,599కి లభిస్తుంది. బ్యాంకు డిస్కౌంట్లు, నో-కాస్ట్ ఈఎంఐ అదనంగా లభిస్తాయి.
నథింగ్ ఫోన్ 3 ధర బ్లాక్ ఫ్రైడే డీల్స్‌లో భాగంగా రూ. 59,999కే అందుబాటులో ఉంది. ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఆర్‌బీఎల్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకుల క్రెడిట్ కార్డులతో పాటు ఇతర కార్డుల ద్వారా రూ. 10 వేల వరకు డిస్కౌంట్ ఆఫర్ పొందవచ్చు.






