- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bill Gates: ప్రపంచ టాప్-10 సంపన్నుల జాబితాలో స్థానం కోల్పోయిన బిల్‌గేట్స్
బిల్ గేట్స్ తన ఛారిటీ విరాళాలను లెక్కించినప్పుడు ఆయన నికర సంపద 30 శాతం మేర తగ్గింది.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రపంచ అత్యంత సంపన్నుల జాబితాలో కొన్ని దశాబ్దాలుగా అగ్రస్థానంలో ఉన్న మైక్రోసాఫ్ట్ కో-ఫౌండర్ బిల్ గేట్స్, తాజాగా టాప్-10 లిస్ట్‌లో స్థానం కోల్పోయారు. కేవలం ఏడు రోజుల్లోనే 52 బిలియన్ డాలర్ల(మన కరెన్సీలో రూ. 4.5 లక్షల కోట్ల)ను కోల్పోవడంతో ప్రపంచంలోని 10 మంది ధనవంతుల నుంచి వైదొలిగారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, బిల్ గేట్స్ తన ఛారిటీ విరాళాలను లెక్కించినప్పుడు ఆయన నికర సంపద 30 శాతం మేర తగ్గింది. అయితే, గతంలో బిల్‌గేట్స్ వద్ద సహాయకుడిగా పనిచేసి మైక్రోసాఫ్ట్ సీఈఓగా ఎదిగిన స్టీవ్ బామర్ సమదలో బిల్‌గేట్స్‌ను అధిగమించడం విశేషం. ఇటీవల బిల్‌గేట్స్ సంపదను సమీక్షించారు. విరాళాలకు ఇస్తున్న ప్రాధాన్యత, గేట్స్ ఫౌండేషన్‌కు అందించే భారీ విరాళాలను లెక్కించారు. ఈ క్రమంలోనే ఆయన సంపద 30 శాతం తగ్గింది. ఫలితంగా ఆయన సంపద 175 బిలియన్ డాలర్ల నుంచి 124 బిలియన్ డాలర్లకు చేరింది. దీంతో ప్రపంచ సంపన్నుల జాబితాలో ఐదో స్థానంలో ఉన్న బిల్‌గేట్స్ ఇప్పుడు 12వ స్థానానికి పడిపోయారు. 172 బిలియన్ డాలర్లతో స్టీవ్ బామర్ ఐదో స్థానంలో ఉన్నారు.
బిల్‌గేట్స్ కంటే ఎక్కువ సంపదతో గూగుల్ సహ వ్యవస్థాపకులు లారీ పేజ్, సెర్గీ బ్రిన్, ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్, తన చిరకాల మిత్రుడు వారెన్ బఫెట్ జాబితాలో ముందున్నారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, అగ్రస్థానంలో ఎలన్ మస్క్(361 బిలియన్ డాలర్లు) ఆ తర్వాత మార్క్ జుకర్‌బర్గ్( 254 బిలియన్ డాలర్లు), లారీ ఎల్లిసన్(253 బిలియన్ డాలర్లు), జెఫ్ బెజోస్ (244 బిలియన్ డాలర్లు), స్టీవ్ బాల్మెర్( 172 బిలియన్ డాలర్లు), లారీ పేజ్( 163 బిలియన్ డాలర్లు), బెర్నార్డ్ ఆర్నాల్ట్(161 బిలియన్ డాలర్లు), సెర్గీ బ్రిన్(152 బిలియన్ డాలర్లు), వారెన్ బఫెట్ (146 బిలియన్ డాలర్లు), జెన్సన్ హువాంగ్ (139 బిలియన్ డాలర్లు), మైఖేల్ డెల్ (138 బిలియన్ డాలర్లు), బిల్ గేట్స్(124 బిలియన్ డాలర్లు) ఉన్నారు.






