మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు షాక్.. ఇకపై ఆ కష్టాలు తప్పవు

by Ajay Maddhiboyina |

దిగ్గ‌జ ఐటీ కంపెనీ మైక్రోసాఫ్ట్ వ‌ర్క్ ఫ్ర‌మ్ ఉద్యోగుకు షాక్ ఇవ్వ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. 2026 జ‌న‌వ‌రి నుండి వారానికి మూడు రోజులు ఆఫీస్ నుండి వ‌ర్క్ చేయాల‌నే నిబంధ‌న పెట్ట‌బోతుంద‌ట‌.

మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు షాక్.. ఇకపై ఆ కష్టాలు తప్పవు
X

దిశ‌, వెబ్ డెస్క్: దిగ్గ‌జ ఐటీ కంపెనీ మైక్రోసాఫ్ట్ వ‌ర్క్ ఫ్ర‌మ్ ఉద్యోగుకు షాక్ ఇవ్వ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. 2026 జ‌న‌వ‌రి నుండి వారానికి మూడు రోజులు ఆఫీస్ నుండి వ‌ర్క్ చేయాల‌నే నిబంధ‌న పెట్ట‌బోతుంద‌ట‌. ఈ నిబంధ‌న వ‌ల్ల మైక్రోసాఫ్ట్ రెడ్ మండ్ ప్ర‌ధాన కార్యాల‌యానికి దూరంగా ఉన్న ఉద్యోగుల‌కు తిప్ప‌లు త‌ప్ప‌వు. ఎందుకంటే ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ కంపెనీలో 2,28,000 మంది ప‌నిచేస్తే అందులో స‌గం మంది ప్ర‌ధాన కార్యాల‌యంలోనే ప‌నిచేస్తున్నారు. ఇక ఇత‌ర ఆఫీసుల్లో ప‌నిచేసే ఉద్యోగులకు సైతం ఇబ్బందులు ఉంటాయి. ఓ నివేదిక ప్ర‌కారం మైక్రోసాఫ్ట్ నాలుగు లేదా ఐదు రోజులు కూడా వ‌ర్క్ ఫ్రమ్ ఆఫీస్ నిబంధ‌న విధించే అవ‌కాశం ఉంది.

అదే విధంగా ఎవ‌రైనా వ‌ర్క్ ఫ్ర‌మ్ ఆఫీస్ చేయ‌లేమ‌ని అనుకుంటే కంపెనీకి రిక్వెస్ట్ చేసుకోవ‌చ్చు. కానీ ఫైన‌ల్ నిర్ణ‌యం మాత్రం యాజ‌మాన్యమే తీసుకుంటుంది. ఇదిలా ఉంటే క‌రోనా త‌రవాత చాలా కంపెనీలు ఐటీ ఉద్యోగుల‌కు వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. క‌రోనా ప్ర‌భావం త‌గ్గిన త‌ర‌వాత కూడా చాలా కంపెనీలు వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ ఇవ్వ‌గా మూడు రోజులు ఆఫీసుకు రావాల‌నే కండిష‌న్ విధించాయి. ఇక ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కూడా అదే దారిలో వెల్ల‌బోతున్న‌ట్టు క‌నిపిస్తోంది. దీంతో ఇంత‌కాలం హ్యాపీగా ఇంటి వ‌ద్ద నుండే ప‌నిచేసిన ఉద్యోగుల‌కు ఇప్పుడు మూడు రోజులు ఆఫీసు కష్టాలు త‌ప్ప‌వు.

Next Story