BREAKING: పసిడి ప్రియులు అస్సలు ఊహించి ఉండరు.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-02-11 09:25:45  IST  )

బంగారం, వెండి ధరలు వరుసగా తగ్గుతూ సామాన్యులకు అందుబాటులోకి వస్తున్నాయనుకుంటున్న తరుణంలో భారీ షాకిచ్చాయి. లైవ్ ట్రేడింగ్ లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా పెరిగాయి.

BREAKING: పసిడి ప్రియులు అస్సలు ఊహించి ఉండరు.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
X

దిశ, వెబ్‌డెస్క్: బంగారం, వెండి ధరలు వరుసగా తగ్గుతూ సామాన్యులకు అందుబాటులోకి వస్తున్నాయనుకుంటున్న తరుణంలో భారీ షాకిచ్చాయి. ట్రంప్ తో భారత్ ట్రేడ్ డీల్ సక్సెస్ అయిన వేళ స్టాక్ మార్కెట్లు లాభాలతో దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలో లైవ్ ట్రేడింగ్ లో బంగారం, వెండి ధరలు షాకిచ్చాయి. హైదరాబాద్ లో తులం బంగారం ధర రూ.3990 పెరిగింది. దీంతో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,55,360కి చేరింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,43,860కి పెరిగింది. కిలో వెండి ధర ఒక్కరోజే రూ.11,700 పెరిగి రూ.2,65,400కి చేరింది. ఉదయం 10 గంటలకు స్వల్పంగా పతనమై మరింత తగ్గిన బంగారం, వెండి ధరలు గంట వ్యవధిలోనే పెరగడంతో సామాన్యులకు ఊహించని షాక్ తగిలినట్లైంది.

సామాన్యులకు ఇది కదా కావాల్సింది.. వరుసగా ఐదోరోజు బంగారం, వెండి ధరలు పతనం

Next Story