'బ్యాంక్ కస్టమర్ల'కు బిగ్ షాక్.. వడ్డీ రేట్ల పెంపునకు సిద్ధమైన 'ప్రభుత్వ బ్యాంకులు'.!

by Geesa Chandu |   (  Updated:2024-08-10 13:49:17  IST  )

మీరేమైనా బ్యాంక్ లోన్ తీసుకున్నారా ? అయితే ఇది మీకోసమే..! ప్రముఖ ప్రభుత్వరంగ బ్యాంక్ లు అయిన కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా సహా.. యూకో బ్యాంక్ లు తీసుకున్న లోన్ లపైన కొద్ది మొత్తంలో వడ్డీ రేట్లను పెంచాయి.

బ్యాంక్ కస్టమర్లకు బిగ్ షాక్.. వడ్డీ రేట్ల పెంపునకు సిద్ధమైన ప్రభుత్వ బ్యాంకులు.!
X

దిశ, వెబ్ డెస్క్: మీరేమైనా బ్యాంక్ లోన్ తీసుకున్నారా ? అయితే ఇది మీకోసమే..! ప్రముఖ ప్రభుత్వరంగ బ్యాంక్ లు అయిన కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా సహా.. యూకో బ్యాంక్ లు తీసుకున్న లోన్ లపైన కొద్ది మొత్తంలో వడ్డీ రేట్లను పెంచాయి. ఇందులో బ్యాంక్ ఆఫ్ బరోడా మూడు నెలలు, ఆరు నెలలు, మరియు సంవత్సరాల పదవీకాలాలపై 5 బేసిస్ పాయింట్ల వడ్డీ రేట్లు పెంచనున్నట్లు ప్రకటించింది. బీఓబీ బ్యాంక్ యొక్క తాజా నిర్ణయంతో రుణాలు తీసుకున్న కస్టమర్లపైన ఈ భారం పడనుంది. అయితే పెంచిన వడ్డీ రేట్లు ఆగస్టు 12 నుంచి అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. బ్యాంక్ ఆఫ్ బరోడా 3 నెలల కాల వ్యవధికి 8.45 % నుంచి 8.5 % MCLR ని పెంచింది. ఇంకా ఆరునెలల కాలానికి 8.7 % నుంచి 8.75 % MCLR ని, ఇక ఒక సంవత్సర కాలానికి అయితే ఆ ఋణాలకు 8.9 % నుండి 8.95 % శాతంగా MCLR ఉండనుంది.

మరి ఈ MCLR అంటే ఏంటీ..?

ఇది ఒక ప్రామాణిక ఋణ రేటు. ఎంసీఎల్ఆర్ కంటే తక్కువకు బ్యాంకులు రుణాలు అందించే అవకాశం ఉండదు. ఈ విధానాన్ని ఏప్రిల్ 1, 2016 నుంచి ఆర్బీఐ ప్రవేశపెట్టింది. నిధుల వ్యయం, నిర్వహణ వ్యయాల లాభాల మార్జిన్ వంటి విషయాలను పరిగణలోకి తీసుకొని, బ్యాంకులు వడ్డీ రేట్లను నిర్ణయిస్తాయి. ఒకవేళ ఎంసీఎల్ఆర్ ను తగ్గిస్తే.. వడ్డీ రేట్లు తగ్గి, తక్కువ వడ్డీకే రుణాలు లభిస్తాయి. పెంచితే వడ్డీ రేట్లు పెరిగి, తీసుకున్న రుణాలు మనకు భారంగా మారతాయి అన్నమాట.

Next Story