BSNL కస్టమర్లకు బిగ్ అలర్ట్

by Muthe.Rajitha |

సైబర్ మోసగాళ్ళు(Cyber Criminals) మరోసారి రెచ్చిపోయారు.

BSNL కస్టమర్లకు బిగ్ అలర్ట్
X

దిశ, వెబ్ డెస్క్ : సైబర్ మోసగాళ్ళు(Cyber Criminals) మరోసారి రెచ్చిపోయారు. సిమ్ కార్డ్ బ్లాక్ అవుతుందని సందేశాలు పంపి. అమాయకులను దోచుకున్నారు. ఇన్నాళ్ళు ప్రైవేట్ నెట్ వర్క్స్ మీదనే దృష్టి సారించిన కేటుగాళ్లు ఇపుడు ప్రభుత్వ రంగ సంస్థ BSNL మీద కన్నేశారు. బీఎస్ఎన్ఎల్ కేవైసీ(KYC)ని ట్రాయ్(TRAI) నిలిపివేసిందని, మరోసారి ఆధారాలు దృవీకరించకపోతే 24 గంటల్లో సిమ్ కార్డు బ్లాక్ అవుతుందంటూ అబద్దపు మెసేజులతో కస్టమర్లను గందరగోళంలోకి నెట్టారు. వారు సూచించిన నెంబరుకు కాల్ చేసి, కేవైసీ సమర్పించాలని, ఫోన్లు చేసిన వారి నుంచి భారీగా దండుకున్నట్టు పలు కేసులు నమోదు అయ్యాయి.

కాగా ఈ ఫేక్ మెసేజెస్ పై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం అయింది. అలాంటి సందేశాలను నమ్మొద్దని, వేరే వారికి షేర్ చేయవద్దని సూచిస్తూ PIB ఫ్యాక్ట్ చెక్(PIB Fact Check) ఓ పోస్టు చేసింది. BSNL కేవైసీ కోసం ఎలాంటి మెసేజులు పంపదని, అలాంటి వార్తల పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలిపింది.

Next Story