- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భీమ్ యాప్‌లో సరికొత్త ఫీచర్.. పిన్ మర్చిపోయినా నో టెన్షన్!
భీమ్ యాప్ తన యూజర్ల కోసం సరికొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. పిన్ మర్చిపోయినా ఈజీగా ఈ ఫీచర్ తో ఏ టెన్షన్ లేకుండా పేమెంట్స్ చేయొచ్చని తెలిపింది.

దిశ, వెబ్ డెస్క్: డిజిటల్ చెల్లింపులను మరింత సులభతరం చేస్తూ భీమ్ (BHIM) యాప్‌లో కొత్త బయోమెట్రిక్ అథెంటికేషన్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీనివల్ల వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్‌లోని భీమ్ యాప్ లో అకౌంట్ కు సెట్ చేసిన పిన్ నంబర్ మర్చిపోయినా ఏం ఫర్వాలేదు. ఫింగర్‌ప్రింట్ (Fingerprint) లేదా ఫేస్ రికగ్నిషన్ (Facial Recognition) ద్వారా రూ. 5,000 వరకు లావాదేవీలను జరపవచ్చు. చాలామంది వినియోగదారులు పేమెంట్ చేసే సమయంలో యూపీఐ పిన్ మర్చిపోవడం లేదా తప్పుగా ఎంటర్ చేయడం వల్ల లావాదేవీలు విఫలమవుతుంటాయి. అటువంటి పరిస్థితుల్లో ఈ బయోమెట్రిక్ విధానం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. రోజువారీ అవసరాల కోసం చేసే క్యూఆర్ కోడ్ స్కాన్ పేమెంట్స్, ఆన్‌లైన్ షాపింగ్, లేదా స్నేహితులకు డబ్బులు పంపేటప్పుడు ఈ ఫీచర్ ప్రక్రియను వేగవంతం, సురక్షితం చేస్తుంది.
బయోమెట్రిక్ అథెంటికేషన్ ఎలా పనిచేస్తుంది?
బయోమెట్రిక్ అథెంటికేషన్ అనేది ఒక వ్యక్తి వేలిముద్రలు లేదా ఫేస్ ను ఉపయోగించి వారి గుర్తింపును నిర్ధారించే సాంకేతికత. దీనివల్ల కేవలం ఫోన్ యజమాని మాత్రమే లావాదేవీని పూర్తి చేయగలరు కాబట్టి, భద్రత పరంగా ఇది మరింత నమ్మదగినది.
భీమ్ యాప్‌లో ఈ ఫీచర్‌ను ఎలా యాక్టివేట్ చేయాలి?
మీ ఫోన్‌లోని భీమ్ (BHIM) పేమెంట్స్ యాప్‌ను ఓపెన్ చేయండి. తర్వాత ప్రొఫైల్ విభాగంలోకి వెళ్లి బ్యాంక్ అకౌంట్ ను సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ కనిపించే బయోమెట్రిక్ ట్రాన్సాక్షన్స్ ఆప్షన్‌ను ఆన్ చేయండి. అంతే.. ఇకపై రూ. 5,000 లోపు చేసే చెల్లింపులకు మీ వేలిముద్రతోనే అనుమతి ఇవ్వవచ్చు. దీనికి భీమ్ నుంచి ఎలాంటి అదనపు చార్జీలు ఉండవు. యూజర్లు వాడే బ్యాంక్ అకౌంట్ ఏదైనా చార్జీ వసూలు చేస్తుందా లేదా అన్నది చెక్ చేసుకోవలసి ఉంటుంది. ఇంటర్నెట్ లేని ఫోన్లలో కూడా *99# డయల్ చేయడం ద్వారా భీమ్ సేవలను ఉపయోగించుకోవచ్చు.






