Airtel: ఏజీఆర్ బకాయిపై డీఓటీ వద్దకు ఎయిర్‌టెల్: గోపాల్ విట్టల్

by S Gopi |

ఏజీఆర్ బకాయిల అంశాన్ని కోర్టు సయోధ్యకు అనుమతించడం సంతోషంగా ఉంది.

Airtel: ఏజీఆర్ బకాయిపై డీఓటీ వద్దకు ఎయిర్‌టెల్: గోపాల్ విట్టల్
X

దిశ, బిజినెస్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం అన్ని ఏజీఆర్ బకాయిలను తిరిగి అంచనా వేయవచ్చని వోడాఫోన్ ఐడియా (వీఐ) దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరో ప్రైవేట్ రంగ దిగ్గజం ఎయిర్‌టెల్ కూడా తమ ఏజీఆర్ బకాయిలను కూడా తిరిగి అంచనా వేయాలని టెలికమ్యూనికేషన్స్ విభాగం (డీఓటీ)ని సంప్రదించనున్నట్టు కంపెనీ వైస్-చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గోపాల్ విట్టల్ అన్నారు. ఏజీఆర్ బకాయిల అంశాన్ని కోర్టు సయోధ్యకు అనుమతించడం సంతోషంగా ఉంది. ముందుగా మేము ప్రభుత్వాన్ని సంప్రదించాలని భావిస్తున్నామని కంపెనీ టాప్ ఎగ్జిక్యూటివ్ అన్నారు. లోపాల కారణంగా ఏజీఆర్ లెక్కింపుపై సమీక్షించాలని ఎయిర్‌టెల్ కోరింది. కానీ ఆయా పిటిషన్లు తిరస్కరణకు గురయ్యాయి. తాజాగా ఈ విషయంలో వీఐ పిటిషన్‌పై సానుకూలంగా సుప్రీంకోర్టు స్పందించడం ఆనందంగా ఉంది.

భారతీ ఎయిర్‌టెల్ గతంలో దాదాపు రూ. 40,000 కోట్ల ఏజీఆర్ బకాయిలను ఈక్విటీగా మార్చమని డీఓటీని కోరింది. దీనివల్ల ప్రభుత్వానికి ఎయిర్‌టెల్‌లో 3-4 శాతం వాటా లభిస్తుందని కంపెనీ తెలిపింది. కాగా, వార్షిక ప్రాతిపదికన ప్రభుత్వానికి ఏజీఆర్ చెల్లింపుల ప్రక్రియ 2026, మార్చి నుంచి ప్రారంభమవుతుంది.

Next Story