Airtel-Bajaj Finance: డిజిటల్ ఫైనాన్స్ సేవల కోసం ఎయిర్‌టెల్, బజాజ్ ఫైనాన్స్ భాగస్వామ్యం

by S Gopi |

ఇప్పటికే పైలట్ ప్రాజెక్ట్ రూపంలో బజాజ్ ఫైనాన్స్‌కు చెందిన రెండు రుణ ఉత్పత్తులను ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్‌లో ప్రారంభించారు

Airtel-Bajaj Finance: డిజిటల్ ఫైనాన్స్ సేవల కోసం ఎయిర్‌టెల్, బజాజ్ ఫైనాన్స్ భాగస్వామ్యం
X

దిశ, బిజినెస్ బ్యూరో: టెలికాం రంగ దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్, ఎన్‌బీఎఫ్‌సీ దిగ్గజం బజాజ్ ఫైనాన్స్ కీలక ఒప్పందం చేసుకున్నాయి. ఆర్థిక సేవల రంగంలో డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఏర్పాటు కోసం భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఈ మేరకు ఇరు సంస్థలు సోమవారం ప్రకటనలో వెల్లడించాయి. ఇప్పటికే పైలట్ ప్రాజెక్ట్ రూపంలో బజాజ్ ఫైనాన్స్‌కు చెందిన రెండు రుణ ఉత్పత్తులను ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్‌లో ప్రారంభించారు. ఈ ఏడాది మార్చి నాటికి బజాజ్ ఫైనాన్స్ నాలుగు రకాల రుణాలను యాప్‌లో వినియోగదారులకు అందుబాటులో ఉంటాయని ఇరు కంపెనీలు స్పష్టం చేశాయి. వాటిలో గోల్డ్ లోన్, బిజినెస్ లోన్, కో-బ్రాండెడ్ ఇన్‌స్టా ఈంఐ కార్డ్, పర్సనల్ లోన్ ఉండనున్నాయి. ఎయిర్‌టెల్ ఈ కేలెండర్ సంవత్సరంలో బజాజ్ ఫైనాన్స్‌తో కలిసి దాదాపు 10 ఫైనాన్షియల్ సేవలను అందిస్తుంది. టెలికాం రంగంలో ఎయిర్‌టెల్‌కు 37.5 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు. బజాజ్ ఫైనాన్స్‌కు 27 రకాల సేవలు, 12 లక్షల డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్, 5,000 బ్రాంచ్‌లు, 70 వేల ఫీల్డ్ ఏజెంట్లు ఉన్నారు. దీంతో రెండు సంస్థలు కలిసి ఆర్థిక రంగంలో సురక్షితమైన, సులభంగా రుణ సౌకర్యాలను అందించనున్నట్టు కంపెనీలు పేర్కొన్నాయి.

Next Story