BFSI: 2030 నాటికి బీఎఫ్ఎస్ఐ రంగంలో 2.50 లక్షల శాశ్వత ఉద్యోగాలు

by S Gopi |

వచ్చే ఐదేళ్ల కాలంలో బీఎఫ్ఎస్ఐ రంగం దాదాపు 2.50 లక్షల శాశ్వత ఉద్యోగాలను సృష్టించగలదు.

BFSI: 2030 నాటికి బీఎఫ్ఎస్ఐ రంగంలో 2.50 లక్షల శాశ్వత ఉద్యోగాలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్(బీఎఫ్ఎస్ఐ) రంగం బలమైన వృద్ధిని సాధిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే ఈ రంగంలో నియామకాలు 8.7 శాతం మేర పెరిగాయి. 2030 నాటికి ఇది 10 శాతం వృద్ధికి చేరుకుంటుందని అంచనా. ప్రముఖ హెచ్ఆర్ సొల్యూషన్స్ అడెకో ఇండియా తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం, వచ్చే ఐదేళ్ల కాలంలో బీఎఫ్ఎస్ఐ రంగం దాదాపు 2.50 లక్షల శాశ్వత ఉద్యోగాలను సృష్టించగలదు. ప్రధానంగా టైర్-2, టైర్-3 నగరాల్లో బీఎఫ్ఎస్ఐ రంగానికి డిమాండ్ వేగంగా పుంజుకుంటోంది, ఈ ఏడాదిలో ఇప్పటికే నియామకాల్లో 25 శాతానికి పైగా చిన్న పట్టణాల నుంచి జరుగుతున్నాయి.

2025 ప్రథమార్థంలో నియామక కార్యకలాపాలలో 27 శా శాతానికి పైగా పెరుగుదల కనిపించింది, ఇది గతేడాదితో పోలిస్తే, ఫ్రంట్‌లైన్, డిజిటల్, నిర్వహణ విభాగాల్లో అధిక నియామకాలు జరిగాయని నివేదిక అభిప్రాయపడింది. స్థానిక భాషపై పట్టు, క్షేత్ర స్థాయిలో అనుభవం ఉన్న అభ్యర్థులకు ఎక్కువ ప్రాధాన్యత కనిపిస్తోంది. వీరికి షార్ట్‌లిస్ట్ చేసే అవకాశం 2.5 రెట్లు ఎక్కువగా ఉంది. అంతేకాకుండా 10-15 శాతం అధిక చెల్లింపులు కూడా పొందవచ్చని నివేదిక వివరించింది. బ్యాంకింగ్ రంగం సేల్స్, రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్, డిజిటల్ ప్రోడక్ట్ మేనేజర్లు, క్రెడిట్ రిస్క్ విశ్లేషకులకు ఎక్కువ అవకాశాలు కల్పిస్తోంది. ఫైనాన్షియల్ కంపెనీలు ఫైనాన్షియల్ ప్లానర్స్, ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్, డిజిటల్ అండర్ రైటర్లు, క్లెయిమ్ ఆటోమేషన్ నిపుణుల కోసం ఎక్కువగా అన్వేషిస్తున్నాయి. ఇన్సూరెన్స్ రంగంలో డిజిటల్ అండర్ రైటర్లు, ఏఐ-ఆధారిత క్లెయిమ్ స్పెషలిస్ట్‌లు, ఫ్రాండ్ డిటెక్ట్ అనలిస్టులు, డిజిటల్ అప్రైజర్‌లతో పాటు అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో మైక్రో ఇన్సూరెన్స్ ఏజెంట్లు, ఫీల్డ్ సేల్స్ ఉద్యోగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నదని నివేదిక పేర్కొంది.

Next Story