Bank Holiday List March 2026 : 2025-26 చివరి నెల.. 17 రోజులు బ్యాంకులు క్లోజ్

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-03-02 06:38:06  IST  )

మార్చినెలలో పండుగలు ఎక్కువగా ఉండటంతో దాదాపు 17 రోజులు బ్యాంకులు మూసి ఉండనున్నాయి. RBI హాలిడేస్ లిస్టు ప్రకారం ఈ సెలవులుంటాయి.

Bank Holiday List March 2026 : 2025-26 చివరి నెల.. 17 రోజులు బ్యాంకులు క్లోజ్
X

దిశ, వెబ్‌డెస్క్: మార్చి నెలలో దాదాపు సగంరోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. రెండవ, నాల్గవ శనివారాలు, ఐదు ఆదివారాలతో పాటు.. పండుగలు కూడా ఎక్కువగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. అయితే కొన్ని పండుగల సెలవుల తేదీల్లో రెండ్రోజుల క్రితం వరకూ కన్ఫ్యూజన్ ఉండగా.. RBI సెలవుల లిస్టును విడుదల చేయడంతో క్లారిటీ వచ్చింది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. వివిధ రాష్ట్రాల్లో పండుగ జరుపుకునే విధానాన్ని బట్టి సెలవులు మారుతుంటాయి. అయితే.. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఇదే చివరినెల కావడం, సెలవులు ఎక్కువగా రావడంతో ఖాతాదారులు తమ లావాదేవీలు, ఇతర బ్యాంకు పనులను ముందుగా ప్లాన్ చేసుకోవడం బెటర్. క్యాష్ విత్ డ్రాలు, చెక్స్ క్లియరెన్స్, ఇతర బ్రాంచ్ లకు ట్రాన్స్ఫర్లు వంటివి ఆలస్యమవ్వడాన్ని నివారించుకోవచ్చు.

ఇక మార్చి నెలలో బ్యాంకులకు ఎన్ని సెలవులు వచ్చాయో తెలుసా. ఈ నెలలో ఐదు ఆదివారాలు రావడంతో ఐదు హాలిడేస్ అవే ఉన్నాయి. ఆల్రెడీ ఒక ఆదివారం (మార్చి 1) సెలవు అయిపోయింది.

మార్చి 2న ఉత్తరప్రదేశ్ లో హోలికా దహన్ సందర్భంగా బ్యాంకులకు సెలవు. కాన్పూర్, లక్నో వంటి నగరాల్లో బ్యాంకులు మూసి ఉంటాయి. మిగిలిన ప్రాంతాల్లో బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయి.

మార్చి 3న హోలి, డోల్ జాతర పండుగల సందర్భంగా హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, పాట్నా, రాంచీ, భోపాల్ వంటి ప్రధాన నగరాల్లో బ్యాంకులకు RBI సెలవు ప్రకటించింది.

మార్చి 4న యోసాంగ్ (హోలీ రెండవరోజు) వేడుకల సందర్భంగా.. న్యూఢిల్లీ, అహ్మదాబాద్, లక్నో, చండీగఢ్, రాయ్‌పూర్, భువనేశ్వర్ వంటి ప్రాంతాల్లో బ్యాంకులు పనిచేయవు. దేశవ్యాప్తంగా ఈ రోజునే హోలీ జరుపుకోనుండటంతో త్రిపుర, గుజరాత్, మిజోరం, ఒడిశా, చండీగఢ్, ఉత్తరాఖండ్, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ, బిహారం, ఛత్తీస్ గఢ్, మేఘాలయ, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో బ్యాంకులు మూతపడనున్నాయి.

మార్చి 8న ఆదివారం: దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.

మార్చి 13 : చాప్కార్ కత్ సందర్భంగా మిజోరంలో బ్యాంకులు క్లోజ్ లో ఉంటాయి.

మార్చి 14న రెండో శనివారం, మార్చి 15న ఆదివారం కావడంతో రెండ్రోజులూ బ్యాంకులకు సెలవులు.

మార్చి 17న షాబ్ ఈ ఖదర్ సందర్భంగా జమ్మూ&కశ్మీర్ లో బ్యాంకులు మూతపడనున్నాయి.

అలాగే మార్చి 19న ఉగాది, గుడి పడ్వా, సాజిబు నోంగ్మా పంబా పండుగల నేపథ్యంలో మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, మణిపూర్, జమ్మూ & కశ్మీర్, గోవా, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో బ్యాంకులు క్లోజ్ అవుతాయి.

మార్చి 20న ఈద్ ఉల్ ఫితర్ (రంజాన్), జమాత్ ఉల్ విదా సందర్భంగా జమ్మూ&కశ్మీర్, కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో బ్యాంకులు మూతపడతాయి.

మార్చి 21న రంజాన్ -ఈద్, సర్హుల్ తదితర పండుగల నేపథ్యంలో అనేక రాష్ట్రాల్లో బ్యాంకులు క్లోజ్ అవుతాయి.

మార్చి 22న ఆదివారం.

మార్చి 26 శ్రీరామనవమి సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు దాదాపు సెలవే.

మార్చి 28న నాల్గవ శనివారం, మార్చి 29 ఆదివారం, మార్చి 31 మహవీర్ జయంతి సందర్భంగా ఆర్బీఐ సెలవులు ప్రకటించింది. కానీ.. 2025-26 ఆర్థిక సంవత్సరానికి చివరి రోజు అవుతుంది కాబట్టి.. లావాదేవీలు, ప్రభుత్వ వ్యాపారాలు నిర్వహించే ఏజెన్సీ బ్యాంకులు తెరిచి ఉంటాయి.

బ్యాంకులకు సెలవు ఉన్నప్పటికీ ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు (UPI, నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్), ఏటీఎంలు యథావిధిగా పనిచేస్తాయి. అయితే.. కేవైసీ అప్‌డేట్, చెక్కుల డిపాజిట్ లేదా డ్రాఫ్టులు వంటి పనుల కోసం వెళ్లేవారు ఈ సెలవులను దృష్టిలో ఉంచుకుని ముందుగానే ప్లాన్ చేసుకోవడం ఉత్తమం.

Next Story