- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Banks: రుణ రేట్లను తగ్గించిన బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంక్
బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంకులు 25 బేసిస్ పాయింట్ల చొప్పున రుణాల రేటును తగ్గించాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) ప్రకటించిన 25 బేసిస్ పాయింట్ల రెపో రేటు తగ్గింపును ప్రకటించింది. ఈ ప్రకటన వెలువడిన గంటల వ్యవధిలోనే బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంకులు 25 బేసిస్ పాయింట్ల చొప్పున రుణాల రేటును తగ్గించాయి. ఈ నిర్ణయంతో రిటైల్ విభాగంలో ఇళ్ల రుణాలపై ఈఎంఐ భారం తగ్గనుంది. ఇతర బ్యాంకులు కూడా త్వరలో ఇదే తరహా ప్రకటనలు చేయవచ్చని బ్యాంకింగ్ వర్గాలు భావిస్తున్నాయి. రెండు ప్రభుత్వ బ్యాంకులు వేర్వేరు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఆర్‌బీఐ తీసుకున్న రెపో రేటు ఆధారంగా రుణాల రేట్లను సవరిస్తున్నట్టు పేర్కొన్నాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో బేస్‌డ్ లెండింగ్ రేటు(ఆర్‌బీఎల్ఆర్) 9.10 శాతం నుంచి 8.85 శాతానికి తగ్గిస్తున్నట్టు పేర్కొంది. సవరించిన రేటు బుధవారం నుంచే అమల్లోకి వస్తాయని పేర్కొంది. యూకో బ్యాంకు రెపో లింక్డ్ రేటును 8.8 శాతానికి తగ్గిస్తూ, గురువారం నుంచి అమలు చేస్తున్నట్టు వెల్లడించింది.






